Nani: సరసమైన రేటుకే హాయ్ నాన్న హిందీ రైట్స్..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న డిసెంబర్ 7 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ థాకూర్ నటించగా, కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. ఇక హాయ్ నాన్న సినిమాని వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా పై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలవగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే బుకింగ్స్ జరుగుతుండగా, ఓవర్సీస్ లో మాత్రం హాయ్ నాన్న కు భారీ ఓపెనింగ్స్ దక్కేలా ఉంది.

ఇదిలా ఉండగా హాయ్ నాన్న యొక్క హిందీ బిజినెస్ డీటెయిల్స్ సమాచారం వచ్చింది. హాయ్ నాన్న సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ ని 7.50 కోట్ల కు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేజిక్కించుకుందట. ఇక హాయ్ నాన్న డిజిటల్ హక్కులని కూడా అన్ని భాషల్లో కలిపి దాదాపు 37 కోట్ల రూపాయలు చెల్లించి ఓ ప్రముఖ ఓటిటి సంస్థ దక్కించుకుందని సమాచారం. అయితే ఆ కంపెనీ డీటెయిల్స్ మాత్రం ఇంకా రాలేదు.

ఇదిలా ఉండగా హాయ్ నాన్న ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోబోతుండగా, తెలుగు రాష్ట్రాల్లో హాయ్ నాన్న కి పది కోట్ల వరకు ఓపెనింగ్స్ దక్కేలా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇక మంచి పాజిటివ్ బజ్ తో రిలీజ్ అవుతున్న హాయ్ నాన్న నాని కి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు