Biggboss season7: శోభా ని కాపాడడానికి బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ల లో ఒకరైన శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కి కలలో కూడా వస్తుంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బయట సీరియల్స్ లో నెగిటివ్ పాత్రలతో పాపులర్ అయిన శోభా బిగ్ బాస్ హౌస్ లో కూడా నెగిటివ్ గా ఆడుతుందని ఒక వర్గం ఆడియన్స్ అంటూ ఉంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో చాలా సార్లు నామినేట్ అయిన శోభా ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది.

పైగా చాలా సార్లు శోభా శెట్టి కి తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ బిగ్ బాస్ ఏదో ఒక విధంగా సేవ్ చేస్తాడని నెటిజన్లు అంటున్నారు. రీసెంట్ గా గౌతమ్ ప్లేస్ లో శోభా ఎలిమినేట్ కావాల్సిందని నెటిజన్లు కామెంట్స్ చేసారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ వచ్చిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ఓ టాస్క్ లో శోభా, యావర్ ఎక్కువ సార్లు గెలిచి, ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ పొందారు. అయితే ఈ ఇద్దరిలో ఒక్కరే ఆ అర్హతని పొందుతారు. అది కూడా హౌస్ మేట్స్ చేతిలో ఉందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్పై బ్యాచ్ యావర్ కి, స్పా బ్యాచ్ శోభా కి సపోర్ట్ చేస్తారు. ఇక మిగిలింది అర్జున్. అర్జున్ కి యావర్ తో పడదు కాబట్టి అర్జున్ తన ఓట్ శోభా కి వేస్తానని ముందే చెప్పాడు. అయితే దానికి రీసన్ మాత్రం శోభా కి వోటింగ్ పరంగా తక్కువ లో ఉంది అందుకే సపోర్ట్ చేస్తా అని సర్ది చెప్పుకున్నాడు. అయితే ఈ టాస్కులన్నీ శోభా శెట్టి ని కాపాడడానికే అని బిగ్ బాస్ చూస్తున్న నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

మరి ఎన్నో వారాలుగా శోభా ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్న ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ కల ఈ వారమైనా నెరవేరుతుందా? లేక తనని కాపాడే ప్రయత్నంలో ప్రిన్స్ యావర్ కి అన్యాయం చేస్తాడా అన్నది చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు