Venuswami: సలార్ పై వేణు స్వామి జోస్యం.. ప్రభాస్ అభిమానుల్లో నిరాశ..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వైరల్ గా నిలిచే ఈయన తాజాగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ పై కూడా పలు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో ఆందోళనలను కలిగిస్తోంది. అసలు విషయంలోకెళితే ప్రభాస్ నటించిన సలార్ చిత్ర ట్రైలర్ గత కొద్ది రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. అయితే దీనిపై సర్వత్రా నిరాశ ఎదురయింది. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.

దీంతో అందరి ఆశలు కూడా సలార్ పైనే ఉన్నాయి. మరొకవైపు కే జి ఎఫ్ సినిమాల పరంపరతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం ఆశలు నిరాశలు అయ్యాయని చెప్పవచ్చు. ప్రభాస్ కనిపించిన తీరు ఆయన డైలాగులు చూశాక నీరసం వచ్చేస్తుందని చెప్పవచ్చు. ఇక అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రభాస్ ఏంటి ఇలా కనిపించాడు అనే డైలామాలో పడ్డారు.

మరొకవైపు సలార్ పై నెగిటివ్ టాక్ ప్రారంభం అవ్వగా ఇది ఇలాగే జరిగితే ఈ సినిమా కూడా డౌటే అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యలు చేయగా అవి ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో వేణు స్వామి ఈ సినిమాతో కూడా ప్రభాస్ విజయాన్ని సాధించలేడు.. ప్రభాస్ కి మరో పరాజయం తప్పదు అంటూ సంచలన కామెంట్లు చేయగా.. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే గతంలో ఆయన చెప్పింది నిజం కాబోతోందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వేణు స్వామి గతంలో కొందరు సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. నాగచైతన్య, సమంత ల విడాకులు.. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్న విషయం ఇవన్నీ కూడా నిజమయ్యాయి..

- Advertisement -

అందుకే ఇప్పుడు సలార్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ ఈసారి కూడా విజయం సాధించడని వేణు స్వామి మాటలతో స్పష్టం అవుతుంది. మరి ప్రభాస్ అభిమానులకు తగ్గట్టుగా ఎప్పుడూ సినిమాలు చేస్తారో చూడాలి. ఇకపోతే ఈనెల 22వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు