Sai Pallavi: స్టేట్ మారనున్న సాయి పల్లవి.. ఫేట్ మారేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందంతో ఎంతోమంది కుర్రకారును తన వశం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. మలయాళంలో ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది.

మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ స్టార్ హీరోలతో నటించకపోయినా టైర్ 2 హీరోలతో నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తెలుగు, తమిళ్ , మలయాళం ఇండస్ట్రీలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలుగులో చివరిగా ఈమె నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేదు. దీంతో విజయం కోసం పరితపిస్తున్న సాయి పల్లవి ఇప్పుడు స్టేట్ మారినట్లు తెలుస్తోంది. అంటే కన్నడ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందట. ఇక హీరో ఎవరు ? డైరెక్టర్ ఎవరు? అనే విషయానికొస్తే.. కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరో యష్ తన 19వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా టైటిల్ ని డిసెంబర్ 8 శుక్రవారం ఉదయం 9:55 గంటలకు ప్రకటించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆమె మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే కచ్చితంగా సాయి పల్లవి ఫేట్ కూడా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాతో పాటు బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలో కూడా ఈమె నటిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు