RockingStar: యష్ ఫ్యాన్స్ అసెంబుల్.. ‘యష్19’ లోడింగ్…

కన్నడ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయిదేళ్ల ముందు వరకు యష్ అంటే కన్నడ ఇండస్ట్రీ కి తప్ప బయట పెద్దగా తెలీదు. కానీ కెజిఎఫ్ రిలీజ్ తరువాత పాన్ ఇండియా వైడ్ గా సూపర్ స్టార్ గా స్టార్ డమ్ సంపాదించుకోవడమే గాక, కెజిఎఫ్ తో తన క్రేజ్ ని వంద రెట్లు పెంచుకున్నాడు. ఒక రకంగా కన్నడలో యష్ కంటే పెద్ద స్టార్స్ అయిన పునీత్, సుదీప్, దర్శన్ లాంటి హీరోల కన్నా ఇండియా వైడ్ గా పదింతలు ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

అయితే కెజిఎఫ్ 2 రిలీజ్ అయి ఏడాదిన్నర కావస్తున్నా యష్ నుండి మళ్ళీ ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. కనీసం తన సినిమా అనౌన్స్ మెంట్ కూడా రాలేదు. అటు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా తీసేందుకు ఎగబడుతున్నా యష్ మాత్రం తన తదుపరి సినిమా గురించి ఎక్కడా నోరు విప్పలేదు.

కానీ ఎప్పుడెప్పుడా అని యష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. యష్ 19వ సినిమా అప్డేట్ హింట్ సైలెంట్ గా ఇచ్చి ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాడు యష్. తన ఇంస్టాగ్రామ్ పేజీ లో ప్రొఫైల్ పిక్ గా సింపుల్ గా లోడింగ్ అంటూ డీపీ పెట్టి హింట్ ఇచ్చాడు. ఇది రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. అయితే తన సినిమాకి సంబంధిచిన మేకర్స్ ఎవరో ఎలాంటి సమాచారం కూడా తెలీదు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు