Surya: చెన్నై వరద బాధితులకు అండగా సూర్య సోదరులు..!

ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు సముద్రతీర ప్రాంతాలు ఈ తుఫాను దాడికి వణికి పోతున్నాయి. వరదల్లో సమీప ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇక చెన్నై సిటీ మొత్తం నీటిలో మునిగిపోయింది. విష్ణు విశాల్ , అమీర్ ఖాన్ వంటి సెలబ్రిటీలు ఇప్పటికే ఈ వరదల్లో ఇరుక్కున్నారు అంటే ఇక వరదలు తాకిడి ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే సముద్ర తీర ప్రాంత ప్రజలను, నీట మునిగిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే వరదలలో చిక్కుకొని కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి సినిమా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.అందులో భాగంగానే హీరోలు సూర్య, ఆయన సోదరుడు కార్తీ తమ వంతుగా ఆర్థిక సహాయం ప్రకటించారు. మొట్టమొదటిగా 10 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. అలాగే ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని తమ అభిమానులకు కూడా పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా గతంలో కూడా చెన్నై వరదల సమయంలో సూర్య బ్రదర్స్ ఇద్దరు స్పందించి తమ వంతు సహాయాలను అందించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరొకసారి తమ గొప్ప మనసును చాటుకుంటూ వరద బాధితులకు సహాయాన్ని చేయడమే కాకుండా అభిమానులకు కూడా సహాయాన్ని అందించాలని కోరుతున్నారు.మరొకవైపు హీరో విశాల్ చెన్నై వరదల పరిస్థితిని చూసి మేయర్ ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అధికారులుగా మీరైతే హ్యాపీగా సురక్షితంగా ఉన్నారుగా.. మేము ఏమైపోతే మీకేంటి అంటూ సెటైర్లు పేల్చాడు. వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రశ్నలపై ఎవరు స్పందించకపోవడం గమనార్హం.

- Advertisement -

ఇకపోతే మరొకవైపు విష్ణు విశాల్ కూడా ఇందులో ఇరుక్కున్నట్లు తెలుపుతూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు. కారప్పాకం లో వున్న మా ఇంట్లో నీరు చేరింది.. సహాయం కోసం చూసి కాల్ చేశాను.. ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయం అందుబాటులో లేవు. ఇంటి పైకప్పు పైకి రావడంతో సిగ్నల్ దొరకడంతో ఇప్పుడు పోస్ట్ చేశాను.. నాలాగే ఎంతో మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే చెన్నైలో వరద ఉద్రిక్తత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు