Karthi: జపాన్ తెలుగు టోటల్ బిజినెస్.. పోటీలో పెద్దదే?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువగా డబ్బింగ్ సినిమాలే ఉండగా, అందులో క్రేజీ బజ్ ఉన్న సినిమా “జపాన్”. కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. ఇక రీసెంట్ గా కార్తీ కూడా సర్దార్, పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో మంచి హిట్ కొట్టడం వల్ల ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక జపాన్ లో కార్తీ ఒక దొంగ గా నటించడం జరిగింది. జపాన్ సినిమాని రాజు మురుగన్ డైరెక్ట్ చేయగా, జివి ప్రకాష్ సంగీతం అందించాడు.

రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడగా, తాజాగా జపాన్ సినిమా యొక్క బిజినెస్ ఇంకా బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. జపాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల బిజినెస్ చేయగా, 6.5 కోట్ల టార్గెట్ తో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తమిళ్ వెర్షన్ 35 కోట్ల వరకు జరిగింది. టోటల్ గా జపాన్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 40 కోట్లకి పైగా జరగగా, 41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవనున్న జపాన్ పూర్తిగా కార్తీ ఫ్యాన్ బేస్ పై, ఇంకా టాక్ పై ఆధారపడిందని చెప్పొచ్చు.

అయితే తెలుగులో వేరే సినిమాల పోటీ కూడా ఉంది కాబట్టి జపాన్ కి ఈ టార్గెట్ పెద్దది అని చెప్పొచ్చు. కార్తీకి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా జపాన్ కి గనక మంచి టాక్ వస్తే వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక జపాన్ ని తెలుగులో దాదాపు 450 కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు