Prashanth neel: “సలార్” లో స్పెషల్ సాంగ్… ఇప్పుడు ఎందుకీ స్టంట్స్?

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ “సలార్” డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. కేజిఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు కీలకపాత్రను పోషిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అయింది. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులే ఉన్నప్పటికీ చిత్ర బృందం ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే ఊహాగానాల మధ్య తాజాగా సలార్ మేకర్స్ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నామంటూ ప్రకటించారు. ప్రస్తుతం “సలార్” పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర రూమర్ చక్కర్లు కొడుతోంది.

నిజానికి “సలార్” మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయిందని అందరికీ తెలుసు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ఫైనల్ కట్ చూశాక కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనుకున్నాడని, అందుకే సినిమా రిలీజ్ కు ఇంత టైం పట్టిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ సినిమాలో స్పెషల్ సాంగ్ ని చొప్పించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మూవీ టీంతో పాటు నటీనటులతో చర్చించిన తర్వాతే ప్రశాంత్ నీల్ ఐటమ్ సాంగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో సిమ్రత్ కౌర్ అనే అమ్మాయి కనిపించబోతోంది.

ఈ బ్యూటీ తెలుగులో డర్టీ హరి అనే అడల్ట్ కంటెంట్ మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సిమ్రత్ కౌర్ తో “సలార్” ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభమైందట. రామోజీ ఫిలిం సిటీ లో మరో మూడు రోజులపాటు షూటింగ్ కొనసాగుతుందని, ఈ పాటతో షూటింగ్ కంప్లీట్ అవుతుందని, డిసెంబర్ మొదటి వారానికి ఫస్ట్ కాపీ కూడా రెడీ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే యూరప్ నుంచి వచ్చేసిన ప్రభాస్ త్వరలో షూటింగ్ లో జాయిన్ అవుతాడట. మోకాలు సర్జరీ అనంతరం ప్రభాస్ మరో 10 రోజులపాటు రెస్ట్ తీసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ప్రశాంత్ నీల్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేయడం ఏంటి? అని ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఒకవైపు తమ డార్లింగ్ మోకాలు సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటుంటే, మరో వైపు స్పెషల్ సాంగ్ అంటూ ఈ స్టంట్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు