Telugu Actress : ప్రగతిని చిన్న ఏజ్ లోనే తల్లిని చేసింది అతడేనట !

టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైన సీనియర్ నటి ప్రగతి చిన్న వయసులోనే తల్లి కావడానికి ఓ వ్యక్తి కారణం అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రగతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.

ప్రగతి సీనియర్ నటిగా టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు అక్క, తల్లి, అత్త లాంటి పాత్రలు చేసే ప్రగతి సోషల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. నటిగా తన టాలెంట్ ఏంటో వెండితెరపై ఇప్పటికే చూపించిన ప్రగతి రియల్ లైఫ్ లో ఫిట్నెస్ పై చాలా ఆసక్తిని కనబరుస్తుంది. అంతేకాకుండా ఇటీవల ఆమె వెయిట్ లిఫ్టింగ్ చేసిన విషయం కూడా వైరల్ గా మారింది. ఏకంగా బెంగళూరులో జరిగిన బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ప్రగతి పాలుపంచుకోవడంతో పాటు మూడో స్థానంలో నిలిచి, కాంస్య పథకం సాధించడం అందరిని నోరెళ్ళబెట్టేలా చేసింది. నిజానికి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు చూసి ప్రగతి ఆంటీ అంటూ ట్రోల్స్ చేసే వారు కూడా ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక వెయిట్ లిఫ్టింగ్ విషయంలో ప్రగతిపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రగతి కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది. పలు సీరియల్లలో ప్రధాన పాత్రలో నటించి ఆమె బుల్లితెర ప్రేక్షకుల మదిని కూడా దోచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రగతి తన జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. హీరోయిన్ కావాలనే ఎన్నో ఆశలతో తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్టుగా వెల్లడించిన ప్రగతి చాలా కాలం వరకు ఎలాంటి అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది.

- Advertisement -

కానీ వచ్చిన కొన్ని చాన్సులు కూడా చేజారిపోయాయని, దీంతో హీరోయిన్ కావాలనే కలను వదిలేసి చిన్న చిన్న పాత్రలు చేయడానికి రెడీ అయినట్టు తెలిపింది. అయితే ఇలా అమ్మ పాత్రలు చేయడానికి కారణం మాత్రం తన మంచిని కోరే ఓ వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి పేరును రివీల్ చేయని ప్రగతి అతను తనని ఎలా ప్రభావితం చేశాడు అనే విషయం మాత్రం చెప్పుకొచ్చింది. హీరోయిన్ పాత్రలు చేస్తే కొద్ది రోజులు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలమని, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే లైఫ్ లాంగ్ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకోవచ్చనే అతని సూచనతోనే తాను తల్లి పాత్రలు చేస్తున్నట్టు ప్రగతి ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. అలా చిన్న ఏజ్ లోనే తాను హీరో హీరోయిన్లకు తల్లిగా మారిపోయిందట. దీంతో ప్రగతి చిన్న ఏజ్ లోనే తల్లి కావడానికి అతనా కారణం అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు