Nayanthara : జాన్వీకి నయన్ అక్కనా? విగ్నేష్ కి పిచ్చి పట్టిందా?

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చి దశాబ్దానికి పైగా గడిచిపోయినా ఆమెకున్న క్రేజ్ రోజురోజుకూ పెనుగుతోందే తప్ప తరగట్లేదు. సౌత్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటారు. అలాంటి ఈ బ్యూటీ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాహ్నవి కపూర్ కి అక్క కాబోతోందట. అది కూడా విగ్నేష్ శివన్ కారణంగా. అసలు కథ ఏంటంటే…

నయనతార జాన్వి కపూర్ కు సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఆమె భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ అక్క పాత్రను పోషించబోతున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కోస్తోంది. ఈ వార్త ఆమె ఫాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తాజాగా తన కొత్త సినిమాను కన్ఫర్మ్ చేస్తూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ సినిమా తన భర్త దర్శకత్వంలో వస్తుండడంతో నయనతార కూడా హీరోయిన్ సోదరి పాత్ర చేయడానికి అంగీకరించిందని సమాచారం.

నిజానికి ఎంత కీలకమైన పాత్ర అయినప్పటికీ సపోర్టింగ్ రోల్స్ చేయడానికి నయనతార ఎప్పుడూ అంగీకరించదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా హీరోయిన్ కు అక్కగా నటించబోతోంది అని వస్తున్న వార్తలు తమిళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. నిజానికి నయనతార ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. రీసెంట్ గా ఆమె నటించిన జవాన్ మూవీ ఎలాంటి హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నయన్ పాన్ ఇండియా హీరోయిన్ రేసులో దూసుకెళ్తుందని, ఈ బ్యూటీ సౌత్ మేకర్స్ కు అందనంత దూరంలో ఉంటుందని అంతా అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఇటీవలే అన్నపూరణి అనే చిన్న సినిమాలో కనిపించింది నయనతార.

- Advertisement -

అది కేవలం తమిళ భాషకు మాత్రమే పరిమితమైంది. అది చాలదు అన్నట్టుగా ఇప్పుడు అక్క పాత్రలో కనిపించబోతోంది. మరి నయనతార తన కెరీర్ గ్రాఫ్ ను ఎటు నుంచి ఎటు తీసుకెళ్తుందో ఆమె ఫ్యాన్స్ కి అర్థం కావట్లేదు. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వస్తేనే గాని అభిమానుల టెన్షన్ తీరేది కాదు. కానీ ఈ వార్త విన్న నయన్ ఫ్యాన్స్ మరో హీరోయిన్ కు నయన్ అక్క ఏంటి? విగ్నేష్ కి ఏమన్నా పిచ్చి పట్టిందా అని కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు