Nayanatara: అది లేని చోట ఉండలేను.. లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార కామెంట్స్..!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వాస్తవానికి ఈమె సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలపైనే వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రేమాయణం ఆమెను మరింత మానసికంగా కృంగతీసిందని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో శింబుతో ప్రేమాయణం కొనసాగించిన ఈమె అందరూ పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. అంతేకాదు వీరు కుటుంబ సభ్యులకు కూడా వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపించాయి. కానీ ఉన్నట్టుండి ఇద్దరు విడిపోయారు.

ఆ తర్వాత ప్రముఖ హీరో ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించింది నయనతార. అదే సమయంలో ప్రభుదేవాకు రామలతతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకు విడాకులు ఇచ్చి నయనతారను వివాహం చేసుకోవాలనుకున్నారు ప్రభుదేవా.. అలా ఇద్దరు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే అది కూడా మాటల వరకే పరిమితం అయింది. అలా ఒకసారి శింబు తో ప్రేమాయణం, మరొకసారి ప్రభుదేవా తో ప్రేమాయణం కొనసాగించి అది పెళ్లి పీటలు ఎక్కకుండానే బ్రేకప్ చెప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. లవ్ ఫెయిల్యూర్ సమయంలో ఎన్నో బాధలను, విమర్శలను ఎదుర్కొంది.

అయితే వాటన్నింటిని అధిగమించి సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈమె తాజాగా తన అభిమాని ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. అంతేకాదు ఈ జంటకు ఇద్దరూ మగ కవల పిల్లలు సరోగసి ద్వారా జన్మించారు.ఇక ప్రస్తుతం 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న నయనతార తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి అలాగే లవ్ ఫెయిల్యూర్స్ కావడానికి గల కారణం గురించి ఒకానొక సందర్భంలో వెల్లడించగా ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఆమె పుట్టినరోజు సందర్భంగా మళ్లీ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇకపోతే లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార ఏమన్నది అనే విషయానికి వస్తే.. నమ్మకం లేని చోట ప్రేమకు చోటు ఉండదు. ఆ ఇద్దరికీ నాకు మధ్య ఎన్నో అపార్ధాలు, మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. వాటి వల్లే ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోయింది. నమ్మకం లేనప్పుడు కలిసి ఉండడం కంటే విడిపోవడం మేలు అని నిర్ణయించుకున్నాము. ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత కష్టాన్నైనా భరిస్తాను. ఇక బ్రేకప్ డిప్రెషన్ నుండి బయటపడడానికి చాలా కష్టపడ్డాను అంటూ నయనతార వెల్లడించింది. మొత్తానికైతే వారితో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు