Fighter Movie: దీపికా రోల్ రివీల్… ఫైటర్ పక్కన ఫైటరే…

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నుంచి సినిమా అంటే… మినిమం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ సినిమా అంటే… ఆడియన్స్ కి ఎలాంటి అంచనాలు ఉంటాయో… ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమాపై చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేసే పనిలో పడింది.

ఇటీవలే సినిమాలో హృతిక్ రోషన్ లుక్ ను పాత్రను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఫైరట్ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) పాత్రలో హృతిక్ కనిపించబోతున్నాడు. సోల్జర్ లుక్ తో హృతిక్ కనిపించాడు. ఈ రోజు దీపికా పదుకొణె లుక్ కూడా రిలీజ్ అయింది. దీపికా కూడా సోల్జర్ లుక్ లోనే కనిపించింది. ఈమె పాత్ర పేరు మినల్ రాథోడ్ (మిన్ని).

ఈ ఫైటర్ సినిమాలో దీపికా పదుకొణె… స్క్వాడ్రన్ పైలట్ గా కనిపించబోతున్నట్టు నేడు రిలీజ్ అయిన పోస్టర్ లో ఉంది. ఈ పోస్టర్ లో దీపికా లుక్ ను చూస్తే, సినిమాలో దీపికాతో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారని అర్థమవుతుంది. బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు కెర్ ఆఫ్ ఆడ్రస్.. సిద్ధార్థ్ ఆనంద్. ఆయన నుంచి ఇటీవల వచ్చిన వార్, పఠాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేశాయో… అందరికీ తెలుసు. పఠాన్ సినిమా అయితే ఏకంగా 1000 కోట్ల మార్క్ ను అందుకుంది.

- Advertisement -

ఇప్పుడు ఫైటర్ సినిమా కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఫైటర్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ వచ్చిన పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. కాగా, ఫైటర్ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరకి వచ్చిన నేపథ్యంలో సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు