Daggubati Abhiram : దగ్గుబాటి వారి పెళ్లి కి స్పెషల్ గెస్ట్.. ఆ హీరోయిన్ తో రిలేషన్ ఏంటి..?

చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న దగ్గుబాటి కుటుంబం పెళ్లి వేడుకలతో హడావిడిగా ఉంది. అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ వివాహం డిసెంబర్ 6వ తేదీన జరగబోతోంది. దగ్గుబాటి అభిరామ్ ఈ ఏడాది అహింస అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాతో ఆయనకి ఆశించిన ఫలితం రాలేకపోయినప్పటికీ అభిరామ్ కి మంచి గుర్తింపు వచ్చింది.

అయితే అహింస తరువాత తన తదుపరి సినిమా ప్రకటిస్తాడని అంతా అనుకున్నప్పటికీ.. సడెన్ గా ఇలా పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. డిసెంబర్ 6న అభిరామ్ పెళ్లి శ్రీలంకలో జరగనుంది. శ్రీలంకలోని అనంతర కలుతారా అనే ఫైవ్ స్టార్ రిసార్ట్ లో అభిరామ్ పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ వివాహ వేడుకకు దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు హాజరు కానున్నాయి. అయితే వీరితోపాటు ఈ పెళ్లికి ఓ స్పెషల్ గెస్ట్ హాజరుకానున్నారు. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.

అదేంటి.. అసలు దగ్గుబాటి కుటుంబానికి, శ్రీలీలకు సంబంధం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వారికి దగ్గర బంధువే కావడం గమనార్హం. తన చినతాత కూతురు కూతురే పెళ్లికూతురు. వధువు పేరు ప్రత్యూష. డిసెంబర్ 6న రాత్రి 8:50 గంటలకు వీరి వివాహ వేడుక జరగనుంది. అయితే ప్రత్యూష – శ్రీలీల చిన్ననాటి స్నేహితులంట. అమెరికాలో చదువుకున్నప్పుడు వీరిద్దరూ క్లాస్ మీట్స్ అని తెలుస్తుంది. అందుకే తన బెస్టీ పెళ్లికి శ్రీలీల శ్రీలంక వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో షూటింగ్ లలో బిజీగా ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కనపెట్టి ప్రత్యూష పెళ్లికి వెళ్లడానికి శ్రీలీల రెడీ అయిందని సమాచారం.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు