Srimukhi: సముద్ర తీరాన అందాలతో హొయలు పోతున్న బుల్లితెర రాములమ్మ.. పిక్స్ వైరల్..!

రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా బుల్లితెర పై రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు పలు సినిమాలలో కూడా కీలకమైన పాత్రలలో నటించి మెప్పించింది. కానీ తనకు బుల్లితెర మీద వచ్చిన సక్సెస్ వెండితెర మీద రాలేదని చెప్పవచ్చు. నిరంతరం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ పలు రకాల పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా శ్రీముఖి థాయిలాండ్ వెకేషన్ కి సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈ వీడియోలో శ్రీముఖి బీచ్ లో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. అక్కడ అలల తాకిడికి శ్రీముఖి ఒక్కసారిగా భయపడే వాతావరణం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. బీచ్ ఒడ్డున నిలబడి ఫోటోలకు స్టిల్స్ ఇస్తున్న సమయంలో భారీ ఎత్తున అలలు వచ్చి శ్రీముఖి ను ఒడ్డుకు నెట్టేయడంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. చివరిలో అలా జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ఇటీవల కాలంలో తుఫాన్లు ఇతరత్ర ప్రాంతాలలో భయపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి వీడియోని పంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పలువురు అభిమానులు నెటిజనులు సైతం శ్రీముఖికి జాగ్రత్తగా ఉండాలని సూచనలు తెలియజేస్తున్నారు. శ్రీముఖి ఈ వీడియోలో చూపించిన విధంగా అలలకు పడిపోవడంతో ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. మరి కొంతమంది ఇలాంటి వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్క అంటూ హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే కామెడీ షోలో హోస్టుగా చేస్తోంది. చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించిన ఈమె ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలలో కనిపించలేదు. ఇదిలా ఉండగా ఈమె పెళ్లి గురించి మాత్రం పలు రకాల రూమర్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇటీవలే ఈమె లవ్ ఫెయిల్యూర్ విషయాలను కూడా తెలియజేసి అభిమానులకు ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది శ్రీముఖి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు