Salaar: ఇక రెండు వారాలే.. అయినా మరే అప్డేట్ లేదే?

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి గా తెరకెక్కిన “సలార్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఎన్నో వాయిదాల అనంతరం డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతుంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా మొదలైనప్పుడే సినిమా చూడాలని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

అయితే సలార్ నుండి ఇప్పటివరకు ఒక్క టీజర్, ట్రైలర్ తప్ప మరే సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. అయినా సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ ని ఇందులో ఊర మాస్ గా స్టయిలిష్ గా చూపిస్తున్నారు మేకర్స్.

అయితే సలార్ సినిమా రిలీజ్ కి కేవలం రెండు వారాలు మాత్రమే బాకీ ఉంది. కానీ సలార్ నుండి ట్రైలర్ రిలీజ్ అయ్యాక మళ్ళి మేకర్స్ నుండి ఇప్పటివరకు మరే అప్డేట్ కూడా రాలేదు. కనీసం ఎలాంటి ఇంటర్వ్యూల్లో కూడా మూవీ టీమ్ పాల్గొనలేదు. పైగా సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతుంది. అలాంటిది మార్కెటింగ్ పై ఫోకస్ చేయకపోతే ఎలా అని ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై గుర్రు మీదున్నారు. తెలుగులో కాకపోయినా కనీసం ఇతర భాషల్లో అయినా ఫోకస్ చేయాల్సిందని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు భావిస్తున్నారు.

- Advertisement -

కానీ చిత్ర యూనిట్ మాత్రం అవేమి పట్టనట్టు సోషల్ మీడియా లో ఇంకా ట్రైలర్ రికార్డులంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. కనీసం మేకర్స్ ఇప్పటికైనా మేలుకొని సలార్ మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు