Tollywood: నందమూరి ఫ్యామిలీలో చీలిక.. బాబాయ్ – అబ్బాయిల మధ్య మళ్లీ చిచ్చు..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ముఖ్యంగా ఈ హీరోలకి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్‌తో మొదలైన నందమూరి సినీ ప్రస్థానం ఇప్పటికీ అటు సినిమాలలో రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకుందని చెప్పవచ్చు. నిన్నటి తరం హీరోలలో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి మాస్ క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు బాలయ్య.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ జనరేషన్ కి తగ్గట్టుగా పలు సినిమాలను తెరకెక్కిస్తూ అదే రేంజిలో తన స్టామినాను చూపిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా కూడా మంచి పాపులారిటీ అందుకుని నందమూరి కుటుంబానికి మరింత పేరు తీసుకువచ్చేలా చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్. అయితే ఈ మధ్య నందమూరి కుటుంబంతో తారక్‌కు పెద్దగా రిలేషన్ లేదనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా వీరి మధ్య జరిగేటువంటి కొన్ని సంఘటనలు చూస్తే ఈ వార్తలు నిజమనేలా అనిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ని లెక్క చేయకపోవడంతో ఎన్టీఆర్ కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి అన్నిచోట్లా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఈనెల 29వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

- Advertisement -

ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కళ్యాణ్ రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య బాబును అతిథిగా పిలిస్తే బాగుంటుందని డైరెక్టర్ అన్నారట. ఇదే విషయాన్ని కళ్యాణ్ రామ్ కి చెప్పగా వెంటనే నో చెప్పారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బాలయ్య ని పిలవాల్సిన అవసరం లేదని.. ఆయనను పిలిచినా కూడా రారని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి అంటూ కళ్యాణ్ రామ్ డైరెక్ట్ గానే చెప్పేసారట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పై గత కొద్దిరోజుల క్రితం బాలయ్య పలు రకాల వ్యాఖ్యలు చేయడంతో కళ్యాణ్ రామ్ ఇలా మాట్లాడారని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. గత కొన్నేళ్లుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య బంధం స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. కళ్యాణ్ రామ్ అప్పుల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై సినిమాలు చేశాడు. దీని వల్ల కళ్యాణ్ రామ్ తన అప్పుల నుంచి బయటపడ్డాడని ఓ టాక్ కూడా ఉంది. అలా అప్పటినుంచి వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతూనే ఉంది.

ఇక అందుకే ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యను దూరం పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఇక నందమూరి కుటుంబంలో చీలికలు ఏర్పడినట్టే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు