Life style: ఇలాంటి వాళ్ళే వెన్నుపోటు పొడిచేది… మీ లైఫ్ లో కూడా ఉన్నారా?

నమ్మకం అనేది మనం సంపాదించుకునే అతి విలువగల ఆస్తులలో ఒకటి. అయితే ఈ రోజుల్లో అవతలి వ్యక్తిపై మనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. మనం ఎంతో నమ్మకం పెట్టుకున్న వాళ్లే వెనకాల ఉండి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అలా గనక జరిగితే ఆ బాధను తట్టుకోవడం ఎవరి తరం కాదు. కాబట్టి సమాజం పోకడను బట్టి మనమే ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే వెన్నుపోటు పొడిచే వాళ్ల గురించి మనకు ముందుగా ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే. ఎలాంటి మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నవారు వెన్నుపోటు పొడుస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆల్రెడీ ఒకసారి ద్రోహం చేసిన వ్యక్తులు. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. మోసం చేసి మనస్తత్వం ఉన్నవారు తప్పు చేసి క్షమించమని అడుగుతారు, మళ్లీ అలా చేయము అని బతిమాలుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇంతకుముందు అంటే గతంలో ఎవరినైనా మోసం చేసిన వ్యక్తి మళ్లీ మోసం చేసే అవకాశం ఉంది.

2. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే వ్యక్తులు అవతలి వ్యక్తిని ఈజీగా వెన్నుపోటు పొడుస్తారు. సోషల్ మీడియా కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమయ్య వ్యక్తులు కచ్చితంగా మోసం చేస్తారని ఒక సర్వేలో వెల్లడైంది.

- Advertisement -

3. స్వార్థపరులు కూడా అవతలి వ్యక్తిని వెన్నుపోటు పొడిచడానికి పెద్దగా ఆలోచించరు. నార్త్ సిస్ట్ మనస్తత్వం ఉన్నవారు వాళ్లకు అవతల నుంచి ఎంత ప్రేమ దొరుకుతుంది అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతేగాని తమను ఇష్టపడే వాళ్ల గురించి అస్సలు పట్టించుకోరు. అంతేకాదు అలాంటి వాళ్లు ఎవరో ఒక వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తే సరిపోదు, అందరూ తమనే ఇష్టపడాలని కోరుకుంటారు. అవతలి వ్యక్తి బాధపడతారని తెలిసిన కూడా పట్టించుకోకుండా వాళ్లు తనకు ఎలా ఉపయోగపడతారు అనే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తారు.

4. ఇక ధనవంతులైన పురుషులు ద్రోహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే పేద స్త్రీలు కూడా ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేదరికంలో ఉన్న మహిళలు తమకు ఆర్థికంగా మెరుగైన జీవితం నిచ్చే భాగస్వామి కోసం వెతుకుతారు.

5. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పరిశోధనల ప్రకారం 9తో ఏజ్ ఎండ్ అయ్యే వ్యక్తులు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. డేటింగ్ సైట్ లో నుంచి తీసుకుని విశ్లేషించిన సమాచారం ప్రకారం 29, 39, 49, 59 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు తమ జీవితంలో జరిగిపోయిన గత దశాబ్దాన్ని పక్కన పెట్టి మరొక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడతారట. అలాంటి వ్యక్తులు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? అని చూసుకొని జాగ్రత్తగా ఉండండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు