Sleeping Disorder : మీకు కూడా ఈ డిజార్డర్ ఉందా? ఇలా చెక్ చేసుకోండి

మనిషి ఆరోగ్యంగా ఉండడంలో నిద్ర అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎంత హాయిగా నిద్ర పడితే అంత ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది సుఖమైన నిద్రకు దూరమవుతున్నారు. కారణాలు ఏవైనా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. అవే స్లీపింగ్ డిజార్డర్ కు దారితీస్తున్నాయి. స్లీపింగ్ డిజార్డర్ అంటే సరిగ్గా నిద్రపోలేకపోవడం. ఈ డిజార్డర్ కారణంగా అనేక రకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. మన లైఫ్ స్టైల్ లో ఉండే అలవాట్లు కొన్ని స్లీపింగ్ డిజార్డర్లకు కారణం అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సరిగ్గా నిద్ర పట్టకపోవడం సాధారణ విషయమే. కానీ రెగ్యులర్ గా మీరు నిద్రలేమితో బాధపడితే నిపుణుల సలహాలు తీసుకొని వెంటనే చికిత్స పొందడం మంచిది. మరి మీకు కూడా ఈ డిజార్డర్ ఉందా? అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? స్లీపింగ్ డిజార్డర్ లక్షణాలు ఏంటి? ఒకవేళ స్లీపింగ్ డిసార్డర్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీపింగ్ డిజార్డర్ లక్షణాలు
30 నిమిషాల కంటే ఎక్కువ నిద్ర పోలేకపోవడం, ఎనిమిది గంటలు నిద్ర తర్వాత కూడా అలసటగా అనిపించడం, తగినంతగా నిద్ర పోయిన తర్వాత కూడా చిరాకు రావడం, రాత్రి సమయాల్లో ఎక్కువసార్లు మెలకువ రావడం, ఒకసారి నిద్రలేస్తే మళ్లీ నిద్ర పట్టకపోవడం, పగటిపూట నిద్రమత్తు ఉండడం, సమయంతో సంబంధం లేకుండా నిద్ర రావడం, నిద్రపోతున్నప్పుడు గట్టిగా గురక పెట్టడం, గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, నిద్రపోతున్నప్పుడు పాదాలు జలదరించడం, నిద్రపోతున్నప్పుడు గొణగటం వంటి లక్షణాలు ఒక నెల కంటే ఎక్కువగా ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

స్లీపింగ్ డిజార్డర్ కు కారణాలు
ఒత్తిడి, ఆస్తమా, సైనస్, డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆమ్నియా, కొన్ని ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, డ్రగ్స్, ఆల్కహాల్ లేదా సిగరెట్ ఎక్కువగా తాగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి ఈ స్లీపింగ్ డిజార్డర్ కు కారణం అవుతాయి.

- Advertisement -

స్లీపింగ్ డిజార్డర్ కు చికిత్స
వైద్యుడిని సంప్రదించిన అనంతరం వాళ్ళ సూచనలకు తగ్గట్టుగా లైఫ్ స్టైల్ ను, ఆహారపు అలవాట్లను మార్చుకోండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. పడుకునే ముందు నీళ్లు తక్కువగా తాగండి. బరువును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు రాత్రి భోజనంలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేట్టుగా చూసుకోండి. ఏ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో మేలుకొనాలి అనే సమయాన్ని ముందే నిర్ణయించుకోండి. కెఫిన్, స్వీట్లు తక్కువగా తీసుకుంటూ, వీలైనంతవరకు ఆకుకూరలను తినడం అలవాటు చేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు