Guntur Kaaram : “ఓ మై బేబీ” ఏంటిది? థమన్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ మూవీ ప్రమోషన్స్ ఇప్పటినుంచే స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి “ఓ మై బేబీ” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కానీ ఆ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో “గుంటూరు కారం” పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గుంటూరు కారం మూవీ 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. సినిమా రిలీజ్ కు ఇంకా దాదాపు నెల రోజులు ఉండగానే చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ “దమ్ మసాలా” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కు తగ్గట్టుగానే అద్భుతంగా ఉండటంతో పాటు, తమన్ అందించిన మ్యూజిక్ కూడా యాడ్ అయ్యి మహేష్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేసింది. దీంతో హ్యాపీగా ఫీల్ అయిన టీం ఆ తర్వాత ఒక రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయడానికి మీకు ప్లాన్ చేశారు. ముందుగా “ఓ మై బేబీ” అనే గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఊరించారు.

ఇక బుధవారం రోజు “ఓ మై బేబీ” పూర్తి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. కానీ ఆ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మిగతా ఆడియన్స్ సంగతి ఎలా ఉన్నా మహేష్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్ పై, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు. ఎంతగానో ఎదురు చూసిన వారికి ఈ సాంగ్ నచ్చకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. అసలు ఈ సాంగ్ లో స్పార్క్ లేదని, సాహిత్యం కూడా రొటీన్ గా ఉందని, ఏదో మహేష్ బాబు ఉన్నాడని ఆలోచన తప్ప సాంగ్ అస్సలు ఆకర్షనీయంగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. సోలోగా వినడానికి ఇంత దారుణంగా ఉన్న ఈ లిరికల్ సాంగ్ సినిమాలో ఏ సందర్భంలో వస్తుందో, అసలు ఫ్లోలో వస్తుందా? లేక కావాలని ఇరికించినట్టుగా ఉంటుందా సాంగ్ అనే విషయం గురించి మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఏదేమైనా గుంటూరు కారం మూవీ ఆల్బమ్ పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ విషయాన్ని థమన్ తో పాటు త్రివిక్రమ్ కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. లేదంటే ఆడియన్స్ నుంచి ఇలాంటి వ్యతిరేకతను మరోసారి ఎదుర్కోక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు