Rakshasa Raja : రానాలో హీరోకన్నా రాక్షసుడినే ఇష్టపడుతున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటిలో హీరోఇజం కన్నా విలనిజాన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారా? సిల్వర్ స్క్రీన్ పై ఆయనలో ఉన్న రాక్షసత్వాన్ని చూసి ఆనంద పడుతున్నారా? ఈ హీరోకు తెరపై హీరో కావడం కంటే, విలన్ అవ్వడమే కలిసొస్తుందా? అంటే… సమాధానం ఎస్ అనే అనిపిస్తుంది. అలా అనిపించడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. మరి ఆ కారణం ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

“నేనే రాజు నేనే మంత్రి” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాంబో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ తేజ. ఈ సూపర్ హిట్ కాంబో తాజాగా మరోసారి రిపీట్ కాబోతోంది. ఆ మూవీకి “రాక్షస రాజా” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. రానా పుట్టినరోజు సందర్భంగా రాక్షస రాజా అనే పవర్ ఫుల్ టైటిల్ తో పాటు రానా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లో గడ్డంతో సిగార్ తాగుతూ చాలా బీభత్సమైన అవతారంలో కనిపిస్తున్నాడు రానా. అంతేకాకుండా ఆ పోస్టర్లో తుపాకీ, బుల్లెట్లు, అలాగే రానా తన పేర్లకు బంగారు ఉంగరాలు ధరించడం, నుదుటిన విభూది తిలకం చూస్తుంటే రానా ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను పోషించబోతున్నాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ మూవీలో రానా గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక చిన్న పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. అయితే ఒక్క పోస్టర్ తోనే “రాక్షస రాజా” సినిమా చుట్టూ నెలకొన్న పాజిటివ్ చూస్తుంటే ఈ హీరోకు రాక్షసత్వం బాగా కలిసొస్తుందేమో అనిపిస్తుంది.

నిజానికి రానాకు హీరోఇజం ఉన్న పాత్రల కంటే విలనిజం ఉన్న పాత్రలే ఎక్కువగా కలిసి వచ్చాయి. గతంలో “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. హిట్ కోసం ఈ హీరో ఎదురు చూస్తున్న టైంలోనే సరికొత్త అవతారంలో రానా రావడం, హిట్ కొట్టడం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత “బాహుబలి” సినిమాలో విలన్ గా నటించి, తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టి భల్లాల దేవగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు “రాక్షస రాజా” అనే మూవీలో కూడా ఈ హీరో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించబోతున్నట్టు అర్థమవుతుంది. ఒకవేళ ఈ సెంటిమెంట్ గనక రానా విషయంలో వర్కౌట్ అయిందంటే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రానా హీరోగా నటించిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ తోనే ఆగిపోయాయి. కానీ ఆయన విలన్ గా నటించిన సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక చాలాకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత రానా నటిస్తున్న మూవీ ఇదే కావడంతో ఆయన అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ మూవీతో రానా మరో సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు