Bollywood: మరోసారి రష్మికను టార్గెట్ చేసిన దుండగులు.. డీప్ ఫేక్ వీడియో తో..!

టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరు పొందిన హీరోయిన్ రష్మిక గత కొద్దిరోజుల నుంచి డీప్ ఫేక్ వీడియోతో పలు రకాల వీడియోలను సృష్టించి కొంతమంది దుండగులు వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఈ వీడియోల పైన చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఆ దుండగులు మాత్రం వీటికి భయపడి వెనకడుగు వేయకుండా సరికొత్త వీడియోలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు.

ఇందులో భాగంగానే మొన్నటికి మొన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రష్మిక ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఈ వీడియోలకు అటాచ్ చేసి ఇంటర్నెట్లో తెగ రచ్చ చేశారు.. ఇంకా ఆ రచ్చ పూర్తి కాలేదు ఇప్పుడు మళ్లీ తాజాగా మరొకసారి క్లియర్ డీప్ ఫేక్ వీడియోని సైతం సృష్టించి రష్మికని చాలా ఇబ్బందులు పెట్టేలా చేస్తూ ఉన్నారు. గతంలో ఇలాంటి ఒక వీడియో వైరల్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్ పలువురు సెలబ్రిటీలు సైతం మండిపడడం జరిగింది. ఇలాంటి వాటిని ఆపాలంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది.

పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక క్రేజ్ ని పడేయడానికి ఇలాంటి ఫేక్ డీప్ వీడియోలతో చాలామంది ఇలా చేస్తున్నారంటూ కూడా రష్మిక అభిమానులు తెలియజేస్తున్నారు. రోజు రోజుకి రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోతూనే ఉన్నది.అలాంటి రష్మిక ఇలాంటి వరుస వీడియోలను ఎదుర్కోవడం చాలా బాధాకరమని చెప్పవచ్చు. ఇలాంటి వీడియోల పైన అధికారులు , పోలీసులు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు చేపట్టలేదు . ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు బయటకు రావడంతో ఆమె అభిమానులు సైతం తమ నిరాశని తెలియజేస్తున్నారు.

- Advertisement -

రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. పుష్ప సినిమాతో శ్రీవల్లిగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు మళ్లీ యానిమల్ సినిమాలో అంతకుమించి పాత్రలో నటించి మరింత క్రేజ్ అందుకున్నది.. ఇలా వచ్చిన క్రేజ్ తోనే పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు అల్లు అర్జున్ తో కలిసి పుష్ప-2 సినిమాలో కూడా నటిస్తున్నది. ఈ సినిమాలో డి గ్లామరస్ గా రష్మిక మరొకసారి కనిపిస్తోంది. గతంలో పుష్ప సినిమాలో కూడా ఇలాగే కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో వంటి సినిమాలలో నటిస్తోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు