Anu Immanuel: పెళ్లికి సిద్ధమైన అను ఇమ్మానుయేల్.. అల్లు శిరీష్ పరిస్థితి ఏంటి..?

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించినా.. పెద్దగా సక్సెస్ కాలేకపోతున్న హీరోయిన్లలో అను ఇమ్మానుయేల్ కూడా ఒకరు.. అందానికి అందం ఉన్నప్పటికీ పెద్దగా అదృష్టం కలిసి రాలేదని చెప్పవచ్చు. సౌత్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అను ఇమ్మానుయేల్.. ఈమె నటించిన రెండు మూడు సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్లని మూటకట్టుకున్నాయి.. దీంతో అను ఇమ్మానుయేల్ పై ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది.

అను ఇమ్మానుయేల్ కు అవకాశం వస్తే చాలు కథ వినకుండానే పలు సినిమాలను ఒప్పుకుంటూ ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఈమె నటించే పాత్రలకు ప్రాధాన్యత లేకుండా నటించడం వల్లే ఈమె సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయని అభిమానులు తెలుపుతున్నారు. మొదట అను ఇమ్మానుయేల్ గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నానితో కలిసి మజ్ను అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాతో పేరు తెచ్చుకుంది కానీ ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి “కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త” అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆక్సిజన్ సినిమా కూడా విడుదలై ఈ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

ఆ వెంటనే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ గా నిలిచింది. మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి అజ్ఞాతవాసి సినిమాలో నటించినా.. ఇది కూడా ఫెయిల్యూర్ గానే మిగిలింది. శైలజా రెడ్డి అల్లుడు, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాలు కాస్త పర్వాలేదు అనిపించుకున్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఈమె తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. అల్లు శిరీష్ తో సినిమా నటిస్తున్న సమయంలో ఈమెకు అల్లు శిరీష్ కు మధ్య ఏదో సంథింగ్ నడుస్తోందని వార్తలు ఎక్కువగా వినిపించాయి.

- Advertisement -

కానీ ఇప్పుడు తాజాగా అను ఇమ్మానుయేల్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది. అదేమిటంటే గత కొద్దిరోజుల నుంచి ఒక కోలీవుడ్ హీరోతో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతోందని.. ఈ విషయాన్ని ఇరువురు కుటుంబ సభ్యులకు తెలపగా వారు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికాలంలో వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు నిర్వహించారని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు సైతం మరి అల్లు శిరీష్ పరిస్థితి ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు