Raviteja : మాస్ మహారాజా కష్టాలు కంటిన్యూ… హీరోయిన్ దొరకట్లేదా?

మాస్ మహారాజ రవితేజకు ప్రస్తుతం ఇండస్ట్రీలో కష్టాలు తప్పట్లేదు. ఇన్ని రోజులు ఆయన రెమ్యూనరేషన్ ప్రాబ్లం అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సీనియర్ హీరోకు హీరోయిన్ దొరకట్లేదు అని ప్రచారం జరుగుతుంది. రవితేజ సినిమాకు నిజంగానే హీరోయిన్ దొరకట్లేదా? అసలు రవితేజ నెక్స్ట్ మూవీ కోసం హీరోయిన్ల వేట ఎక్కడ దాకా వచ్చింది? అనే అప్డేట్ విషయానికి వస్తే…

మాస్ మహారాజా రవితేజ మార్కెట్ ఇప్పుడు దారుణంగా ఉండడంతో అది ఆయన కెరీర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. రవితేజ గత చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్టు రూపొందాల్సి ఉంది. ఈ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్న టైగర్ నాగేశ్వరరావు పూర్తిగా నిరాశపరిచింది. ఈ మూవీ దారుణంగా డిజాస్టర్ కావడంతో అది ఆయన నెక్స్ట్ సినిమాలపై ఎఫెక్ట్ చూపించింది. దాని ఫలితంగానే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలోసిన ప్రాజెక్ట్ చేజారింది. అనంతరం ఈ హీరో మరో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. హరి శంకర్ ఈ సమయానికి పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ పవర్ స్టార్ ప్రస్తుతం రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, కొంతకాలం సినిమాలకు బ్రేక్ ని ఇచ్చాడు. దీంతో ఇప్పటిదాకా వెయిట్ చేసిన హరీష్ శంకర్ కు ఇంకా పవన్ తో ప్రాజెక్ట్ పట్టాలి కావాలంటే చాలా సమయం పడుతుంది అనే విషయం అర్థం అయిపోయింది. ఆ గ్యాప్ లో రవితేజ తో వీలైనంత త్వరగా ఒక సినిమాను పూర్తి చేయాలని హరీష్ కమిట్ అయ్యారు. ఇక వీరిద్దరి కాంబోలో “రైడ్” అనే హిందీ మూవీని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. నిన్న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతోంది. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది కానీ హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. హరీష్ శంకర్ తను లక్కీగా భావించే పూజ హెగ్డేను తీసుకోవాలనుకున్నాడట. కానీ ఆమె తన షెడ్యూల్ బిజీ అంటూ లైట్ తీసుకుందట. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అయిన మీనాక్షి చౌదరిని అనుకున్నారట. అయితే ఆమె కూడా చాలా బిజీగా ఉంది. ఇక చేసేది లేక మరో సీనియర్ హీరోయిన్ ఇలియానాను సంప్రదించిన పనులు జరగలేదని తెలుస్తోంది. దీంతో బల్క్ డేట్స్ ఇచ్చి, షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తిచేసే సరైన హీరోయిన్ కోసం హరీష్ శంకర్ వేట మొదలు పెట్టాడట.

- Advertisement -

ఇక ఇదంతా తెలుసుకున్న నెటిజెన్లు ప్రస్తుతం రవితేజ టైం అంతగా బాగా లేకపోవడం వల్లే హీరోయిన్లు ఇలా హ్యాండ్ ఇస్తున్నారని, దీంతో రవితేజ హీరోయిన్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం ప్రస్తుతం రవితేజ తన పోర్షన్స్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. మరి ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రైడ్” రీమేక్ ను నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు