Raviteja – Harish Shankar – మరో పూజాహెగ్డే కావాలా నాయనా? హీరోయిన్ కు లైఫ్ ఇచ్చే పనిలో పడ్డ డైరెక్టర్

రీమేక్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన నెక్స్ట్ మూవీని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమాను చేయాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడం వల్ల ఆ మూవీ హోల్డ్ లో పడింది. దీంతో టైం వేస్ట్ చేసుకోకుండా హరీష్ శంకర్ తన నెక్స్ట్ మూవీపై కాన్సన్ట్రేట్ చేశాడు. ఎలక్షన్స్ అయిపోయి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే లోగా ఓ సినిమా చేసేయొచ్చు అన్న ఆలోచనతో రవితేజతో మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు.

మరోవైపు రవితేజ సైతం వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతం అవుతున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న రవితేజ హరీష్ శంకర్ తో వీలైనంత త్వరగా ఓ మూవీని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. నిజానికి రవితేజ తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఈ మూవీ ఆగిపోవడంతో రవితేజ కూడా హరిశంకర్ తో మూవీ చేయడానికి టైం అనుకూలించింది. ప్రస్తుతం హరిష్ శంకర్ – రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు “రైడ్” అనే హిందీ మూవీకి రీమేక్ అని సమాచారం. అయితే రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకోవడం రావడానికి ఆ స్క్రిప్ట్ లో డైరెక్టర్ చాలా మార్పులు చేసినట్టుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం హీరోయిన్ల వేటలో పడ్డారట మేకర్స్.

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా దూసుకెళ్తున్న శ్రీలీల లాంటి హీరోయిన్లు మాత్రం ఈ మూవీకి వద్దని నిర్మాతలు కోరుతున్నారట. అందుకే డైరెక్టర్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. గతంలో సరైన హిట్స్ లేని టైంలో “డీజే దువ్వాడ జగన్నాథం” మూవీతో పూజ హెగ్డేకి హరీష్ శంకర్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాతే పూజ హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఓ ముంబై హీరోయిన్ కోసమే వెతుకున్నారట. కొత్త అమ్మాయి, యాక్టింగ్ టాలెంట్ ఉండి,పెద్దగా పరిచయం లేని గ్లామరస్ బ్యూటీని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆమెకి లైఫ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్. మరి ఈసారి హరీష్ శంకర్ చేతిలో పడి, మరో పూజ హెగ్డే కానున్న హీరోయిన్ ఎవరో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు