Telugu Actress: ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ కి ఆశపడ్డ ప్రియమణి..!

నటి ప్రియమణి అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జగపతిబాబుతో పెళ్లయిన కొత్తలో సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ వెంటనే తమిళ్ లో పరుత్తి వీరన్ తో ప్రియమణి జాతీయ ఉత్తమ నటిగా అవార్డుని దక్కించుకుంది. దీంతో అటు తమిళ్ లో ఇటు తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది. నవవసంతం, యమదొంగ, గోలీమార్ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ప్రియమణి.

ఇక ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణి ఇండస్ట్రీకి దూరమవుతుందని అంతా అనుకున్నారు. కానీ అటు బాలీవుడ్ లో, ఇటు వెబ్ సిరీస్, తెలుగులో వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించింది ప్రియమణి. వాస్తవానికి తన మొదటి ఇన్నింగ్స్ లో ప్రియమణి వెంకీ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించాలని అనుకుంది.

కానీ అవకాశాలు దక్కలేదు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం వెంకీ సరసన నారప్ప సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇక మిగిలింది బన్నీ సరసన నటించడమే. ఇప్పుడు ఈ అవకాశం కూడా వచ్చింది. అది కూడా పుష్ప 2 సినిమాతో. కానీ ఈ చిత్రంలో ప్రియమణి అనుకున్నట్లుగా బన్నీతో రొమాన్స్ చేసే ఛాన్స్ కాదు. పుష్ప 1 లో అనసూయ చేసినటువంటి ఇంపార్టెంట్ రోల్ తప్ప హీరోయిన్ రోల్ కాదు. కానీ ప్రియమణి అనుకున్న కల మాత్రం కొంతవరకు నెరవేరుతుంది. మొత్తానికి బన్నీతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ప్రియమణి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు