Mahesh Babu: మహేష్ అందాన్ని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు… కానీ “సంతూర్” డాడ్ అంటే బాగోదేమో ?!

టాలీవుడ్ రాకుమారుడు మహేష్ బాబు అందాన్ని “సంతూర్” వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇంత దాకా సంతూర్ మమ్మీని మాత్రమే మనం తెరపై చూసాము. కానీ ఇప్పుడు “సంతూర్” డాడీ ఆ పాపులర్ యాడ్ లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. మరి “సంతూర్” డాడ్ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాడు? అసలు సంతూర్ డాడ్ అంటే బాగుంటుందా? అంటే…

నాలుగు పదులు దాటుతున్న చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం. ఆయనను టాలీవుడ్ లో ఇప్పటికీ ఎంతోమంది అమ్మాయిలు తమ కలల రాకుమారుడిగా, గ్రీకు వీరుడిగా ఊహించుకుంటూ సంతోషపడతారు. అయితే ఈ రాకుమారుడిని నమ్రత శిరోద్గర్ ఎప్పుడో కొంగున ముడేసుకుంది. అయినప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. కేవలం అమ్మాయిల్లో మాత్రమే కాదు మహేష్ బాబుకు అబ్బాయిల్లో సైతం మంచి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ను, ఆయనకు ఉన్న అందాన్ని క్యాష్ చేసుకోండి “సంతూర్” సంస్థ. గతంలో మహేష్ బాబు ఈ యాడ్ లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు “సంతూర్” మమ్మీకి పడిపోయిన యువకుడిగా మహేష్ బాబును చూపించారు. కానీ ఇప్పుడు కొత్తదనం కోసం సంతూర్ మమ్మీ ని పక్కన పెట్టేసి సంతూర్ డాడీ ని పరిచయం చేయబోతున్నారట.

ప్రస్తుతం మహేష్ బాబు సంతూర్ సోప్ యాడ్ కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిన్న ఈ సోప్ యాడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. దర్శకుడు ఆనంద్ అయ్యర్ సంతూర్ సోప్ యాడ్ ను మహేష్ బాబు పై చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం విడుదల చేసిన మహేష్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ యాడ్ కోసం మహేష్ బాబు ఎంత ఛార్జ్ చేశాడు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు సంతూర్ డాడ్ గా కనిపించబోతున్నాడు అనే విషయం ఆ పిక్ తో బయటకు వచ్చింది. దీంతో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మహిళలు డెలివరీ తర్వాత వాళ్ళ శరీరంలో చాలా మార్పులు ఎదుర్కొంటారు. కాబట్టి సంతూర్ మామ్ అంటే అర్థవంతంగా ఉంటుందేమో. అంతేకానీ ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు రాని అబ్బాయిలను సంతూర్ డాడ్ అంటే బాగోదేమోననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా కొంతవరకు నిజమే. ఆ సబ్బు వాడడం వల్ల ఏజ్ బార్ అవ్వకుండా నిగనిగలాడుతూ కనిపిస్తారు అనే విధంగా సంతూర్ యాడ్ ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఈ యాడ్ వల్లనే సంతూర్ సేల్స్ భారీ డిమాండ్ తో మార్కెట్లో ఫెయిల్ అవుతున్నాయి. మరి కొత్తగా సంతూర్ డాడ్ అంటే వాళ్లకు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

ప్రస్తుతం ఈ హీరో “గుంటూరు కారం” అనే మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు