Vaishnavi: ఆ హీరోయిన్ కి లైఫ్ ఇచ్చేందుకు సమంత ఏం చేసిందో తెలుసా..?

అక్కినేని నాగచైతన్య మాజీ భార్య, ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. సమంత అన్న పేరు వినపడగానే జనాలు ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతూ ఉంటారో మనకు తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

ఆయా భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఇప్పుడు ప్రొఫెషనల్ గా మరో ముందడుగు వేసింది. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే క్రమంలో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ట్రలాల మూవీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది సమంత. ఇక మయోసైటీస్ వ్యాధికి గురైన సమంత యాక్టింగ్ కి ఓ ఏడాది పాటు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సమంత ప్రొడక్షన్ హౌస్ లో మొదటి సినిమాగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యతో తొలి సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

బేబీ సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాపులర్ అయిన వైష్ణవి చైతన్య.. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతం తన మొదటి సినిమా హీరో ఆనంద్ దేవరకొండ తోనే ఇప్పుడు రెండవ సినిమా చేస్తోంది వైష్ణవి చైతన్య. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ఐటెం సాంగ్ చేయడానికి వైష్ణవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడు సామ్ ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కే సినిమాలో వస్తున్న ఫస్ట్ సినిమాలోనే ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్. వైష్ణవికి యూత్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని సమంత ఆమెకు ఈ అవకాశం ఇచ్చిందని అంటున్నారు నెటిజెన్లు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు