Biggboss season7: శోభ కోసం యాడ్ వేస్తె యావర్ కి యూస్ అవుతుందేంటీ!

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం లో హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివాజీ, అర్జున్, అశ్విని, గౌతమ్, భోలే, ప్రియాంక యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి విషెస్ తెలియచేయగా, ఈరోజు అమర్ దీప్, శోభా, యావర్ ఫ్యామిలి మెంబెర్స్ ఎంటర్ అవుతున్నట్టు వీడియో వచ్చింది.

అయితే తాజాగా రిలీజ్ అయిన శోభా కి సంబంధించిన ప్రోమో లో వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియో లో శోభా శెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని వాటేసుకున్నా, శోభ తల్లి మెల్లిగా వచ్చి యావర్ ని హత్తుకుని, నీ అమ్మ ని నేను తీసుకొచ్చా అంటూ, యావర్ తల్లి ఫోటో ఇచ్చింది. ఈ ప్రోమో ట్రేండింగ్ లో దూసుకుపోతుంది.

అయితే ఆ వీడియో కింద ఎక్కువ కామెంట్స్ యావర్ కోసమే ఉండడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియో ద్వారా యావర్ గ్రాఫ్ మరింత పెరిగిపోయింది. తల్లి లేని తనకి ఆడియన్స్ సపోర్ట్ చాలా వస్తుందని చెప్పొచ్చు. అటు శోభా తల్లి కూడా హౌస్ లో పేరు పేరునా అందర్నీ పలకరించగా, శోభా కూడా చాలా ఎమోషనల్ అయింది. అయితే ఈ వీడియో వల్ల శోభా కంటే ఎక్కువగా యావర్ కి హెల్ప్ అయిందని చెప్పొచ్చు. శోభా తల్లి వల్ల శోభా కి కూడా వోటింగ్ పరంగా గ్రాఫ్ పెరిగినప్పటికీ యావర్ కి వచ్చినంత స్థాయిలో కాదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు