Raghava Lawrence: జిగర్ తండా2 బ్రేక్ ఈవెన్ టార్గెట్!

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒక్క తెలుగు సినిమా తప్ప మిగతావన్ని డబ్బింగ్ సినిమాలే అవడం విశేషం. అయితే ఈ సినిమాల్లో మంచి క్రేజీ అంచనాలతో వస్తున్న సినిమా “జిగర్ తండా డబల్ ఎక్స్”. తమిళ్ లో హిట్ అయిన జిగర్ తండా కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్.జె. సూర్య హీరోలు గా నటించారు. ఇక జిగర్ తండా తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ పేరుతో తెరకెక్కిందన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా యొక్క బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జిగర్ తండా2 దాదాపు 5కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. అంటే 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ‘జిగర్ తండా’ సినిమా రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా 35 కోట్ల బిజినెస్ జరిగింది.

అయితే లారెన్స్ ఇంతకు ముందు నటించిన చంద్రముఖి2 డిజాస్టర్ అవడం వల్ల కొంత తక్కువ బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవడానికి పెద్దగా టైం పట్టదు. పైగా ఫస్ట్ పార్ట్ మీద పాజిటివ్ హైప్ దీనిపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ సినిమా కి పోటీగా జపాన్ సినిమా కూడా వష్తుంది, కాబట్టి జిగర్ తండా2 కి వచ్చే టాక్ పైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు