Japan Movie First Review: కార్తీ జపాన్ మూవీ ఫస్ట్ రివ్యూ

తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం “జపాన్” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దీపావళి కానుకగా విడుదలవుతున్న పెద్ద సినిమాల్లో “జపాన్” ఒకటి. రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొంతకాలంగా సరైన హిట్ పడని ఈ బ్యూటీ “జపాన్”పైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ మూవీ నవంబర్ 10న తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ మూవీ కార్తికి 25వ సినిమా కావడం విశేషం. అలాగే ఆయన తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలమే అవుతుంది. ఇక “జపాన్” సినిమాలో కార్తీ పూర్తిగా వైవిధ్యభరితమైన పాత్రను పోషించారు. ఇప్పటికే “జపాన్” టీజర్, ట్రైలర్ లను మంచి రెస్పాన్స్ రావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో వీక్షించడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన “జపాన్” టీం, నేషనల్ స్టార్ నానిని ఆహ్వానించి తెలుగు ఆడియన్స్ కు సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఇక సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకు స్పెషల్ షోలు వేశారట. దీంతో సినిమా ఎలా ఉందన్న టాక్ ముందే బయటకు వచ్చేసింది. మరి “జపాన్” మూవీ ఫస్ట్ రివ్యూ ఏంటంటే… “జపాన్” ఫస్ట్ హాఫ్ ఓకే, క్లైమాక్స్ ఓకే..! సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బోర్ కొడుతుంది. మొత్తంగా ఒకసారి చూడొచ్చని అంటున్నారు.

- Advertisement -

ఇక ఈ దీపావళి పండగతో పాటు వీకెండ్ కూడా కావడంతో “జపాన్” మూవీ ఏమాత్రం ఇతర సినిమాల కన్నాబెటర్ అనిపించినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. మరి రేపు థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారు ? కార్తీ ఈ దీపావళికి హిట్ కొట్టినట్టేనా? తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్నట్టేనా ? అనేది తెలియాలంటే శుక్రవారం దాకా వేచి చూడాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు