Odela 2 – Introducing Shiva Shakthi : తమన్నా మేకోవర్ వీడియో… ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న శివ శక్తి

Odela 2 – Introducing Shiva Shakthi : మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న కొత్త మూవీ ఓదెల 2. తాజాగా ఈ మూవీ నుంచి తమన్నా శివ శక్తి మేకోవర్ కు సంబంధించిన పవర్ ఫుల్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. మరి ఆ వీడియోలో ఉన్న విశేషాలు ఏంటి? అంటే…

శివ శక్తి పరిచయం..

ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతోంది ఓదెలా 2. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించగా, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ మూవీ. ప్రస్తుతం ఓదెల 2లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి కూడా ఉన్నారు. సంపత్ నంది టీం వర్క్, మధు క్రియేషన్స్ బ్యానర్లపై ఈ మూవీని డి మధు, సంపత్ నంది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓదెల 2 మూవీకి కాంతారా ఫేమ్ అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఓం  నమః శివాయ అంటూ ఈ మూవీ నుంచి తమన్నా స్పెషల్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. అందులో తమన్నా శివుడికి పరమ భక్తురాలుగా, ఓదెల రక్షకురాలిగా కనిపించబోతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

ఇక తాజాగా శివ శక్తి ఇంట్రడక్షన్ వీడియోను వదిలారు. అందులో శివ శక్తిగా తమన్నా కంప్లీట్ మేకోవర్ ను చూపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉండడం విశేషం. ఈ వీడియో సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది.

- Advertisement -

షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే?

ఓదెల 2 మూవీ షూటింగ్ మార్చ్ లోనే స్టార్ట్ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. రెండవ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా మొదలైన ఈ షెడ్యూల్ 20 నుంచి 25 రోజుల పాటు కంటిన్యూగా జరుగుతుందని తెలుస్తోంది. అందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్.

మరోవైపు బాక్ లో..

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా త్వరలోనే బాక్ అనే మూవీతో థియేటర్లలోకి రాబోతోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన అరణ్మనై 4 అనే తమిళ హారర్ మూవీని తెలుగులో బాక్‌ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తమన్నాతో పాటే మరో హాట్ బ్యూటీ రాశి ఖన్నా కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ హారర్ కామెడీ మూవీ సమ్మర్ కానుకగా మే 3న పెద్ద తెరపైకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పంచుకో అనే హాట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో తమన్నా, రాశి ఖన్నా ఇచ్చిన గ్లామర్ ట్రీట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ మూవీ గురించి తమన్నా, రాశి ఖన్నా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు