NTR – Prabhas: ఇద్దరి మధ్య విభేదాలు.. అందుకే ఆరు నెలల దూరం..!

NTR – Prabhas.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అటు ఎన్టీఆర్ ఇటు ప్రభాస్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా హీరోలుగా. మంచి పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కంటే ముందే పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇలాంటి హీరోల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయని.. దాదాపు 6 నెలల పాటు వీరు మాట్లాడుకోలేదనే ఒక వార్త తెరపైకి వచ్చింది.. మరి అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం..

NTR - Prabhas: Differences between the two.. That's why six months apart..!
NTR – Prabhas: Differences between the two.. That’s why six months apart..!

ఫ్రెండ్షిప్ కి అర్థం అదే..

సాధారణంగా ఎంత మంచి స్నేహితులైనా ఏదో ఒక సందర్భంలో అలకలు, గొడవలు అనేవి సహజంగా వస్తూ వుంటాయి.. అది సామాన్యులైనా..సెలబ్రిటీలైనా.. ఈ సందర్భం ఎదుర్కోక తప్పదు. అయితే ఎంత అనుకున్నా మళ్లీ కలిసిపోతూ ఉంటారు.. స్నేహంలో ఉన్న ఒకే ఒక్క గొప్పతనం అదే.. అందుకే గొడవలు, తిట్టుకోవడం, కలిసిపోవడం ఇవన్నీ ఫ్రెండ్షిప్ కి మాత్రమే సాధ్యం.. మరి ప్రభాస్ – ఎన్టీఆర్ మధ్య కూడా ఇలాంటి గొడవలే జరిగాయట.. అయితే వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి గల కారణం ఏమిటో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ గా మారుతుంది..

ఎన్టీఆర్ సినిమాలు..

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా.. మరొకవైపు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 సినిమా చేస్తున్నారు. మరొకవైపు దేవర సినిమా పూర్తి అవగానే దేవర 2 కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మధ్యలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి కూడా అవకాశం ఇస్తారని సమాచారం

- Advertisement -

ప్రభాస్ సినిమాలు..

ఇక ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను వరుసగా ప్రకటిస్తూ ఊపిరాడకుండా బిజీగా సినిమాలలో నటిస్తున్నారు.. ప్రస్తుతం ఆయన నటించిన కల్కి సినిమా రిలీజ్ కి సిద్ధం కానుంది. దీంతో పాటు స్పిరిట్ , రాజా సాబ్, సలార్ -2 చిత్రాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ఇదిలా ఉండగా ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్ – ప్రభాస్ మధ్య దూరానికి కారణం..

వీరిద్దరి మధ్య ఒక డైరెక్టర్ వల్ల దూరం వచ్చిందట.. ఒకరినొకరు ఆ మాటకు సంబంధించి సరిగా అర్థం చేసుకోలేకపోవడంతో ఆరు నెలలు దూరంగా ఉన్నట్లు సమాచారం. తర్వాత ఒక ఈవెంట్ లో అనుకోకుండా ఎదురుపడ్డారు. దీంతో అక్కడే ఇద్దరు కూర్చుని అసలు గొడవకు కారణం ఏమిటి అని విశ్లేషించుకున్నారు.. ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిసిపోయారు.. ఇక ఇప్పటికీ వారిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. విభేదాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి అనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది..

రెమ్యునరేషన్ వివరాలు .

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతున్న వీరిద్దరూ పారితోషకాలు కూడా అంతే రేంజ్ లో ఉన్నాయి.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న దేవర చిత్రం కోసం ఎన్టీఆర్ రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటే. ప్రభాస్ కల్కి, రాజా సాబ్ చిత్రాలకు ఒక్కో సినిమాకి రూ.150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు