Jahnavi desatty: కల నెరవేరింది అంటున్న మహాతల్లి.. ఇంతకూ ఎవరీమె..?

Jahnavi desatty.. ఈమధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.. ముఖ్యంగా రోజుకొక వీడియో.. గంటకో ఫోటోతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. అలాగే దర్శక నిర్మాతల దృష్టిలో పడి సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఒక యూట్యూబర్ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకొని ఇప్పుడు ఏకంగా కొత్త ఇంటినే కొనేసింది.. ఇక ఆమె ఎవరు? ఏంటో ?పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

Jahnavi Desatty: Who is Mahatalli who says her dream has come true?
Jahnavi Desatty: Who is Mahatalli who says her dream has come true?

నమ్మలేకపోతున్నా..

ఒకప్పుడు యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మెగా వారసురాలు నిహారిక బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయిన జాహ్నవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా మహాతల్లి అంటే వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. తన భర్తతో కలిసి కొత్త ఇంట్లో కుడికాలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. అంతే కాదండోయ్ తన డ్రీమ్ హౌస్ లో పాలు పొంగించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి కూడా లోనైంది..” నాలుగు సంవత్సరాల క్రితం సుశాంత్, నేను కొత్త ఇంటిని వెతకడం ప్రారంభించాము.. కొంతకాలానికే మాకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనుకునే ఒక ఇల్లు దొరికేసింది..నా కుక్కపిల్లలు ఆడుకోవడానికి , అటు ఇటు పరిగెత్తడానికి సరిపోయేంత పెద్ద స్థలం ఉంది.. మేము ఇల్లు కొనాలని అనుకున్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇది మా వల్ల అయ్యే పని కాదేమోనని మదనపడ్డాము. ఆ సమయంలో నా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నాకు చాలా అండగా నిలబడ్డారు.. ఇప్పుడు కొత్త ఇల్లు సొంతమవుతుంటే అంతా ఏదో కలలా అనిపిస్తోంది.. పైగా నేను నమ్మలేకపోతున్నాను అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చింది జాహ్నవి..

ఎవరి జాహ్నవి..

కర్నూలుకు చెందిన తెలుగమ్మాయి.. లిఫ్ట్ లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఈమె.. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ హరీష్ నాగరాజుతో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కు పనిచేసింది. అలా మహాతల్లి – మహానుభావుడు అనే వెబ్ సిరీస్ లో మంచి పేరు కూడా లభించింది.మహాతల్లి అంటూ ఈ పేరు చెబితే తప్ప ఈమెను గుర్తుపట్టడం అసాధ్యం.. అంతలా ఈ పేరుతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది జాహ్నవి.. అంతేకాదు మహాతల్లి పేరిట సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది ఇక వెబ్ సిరీస్ చేస్తున్న సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ భారీగానే పాపులర్ అయ్యింది..

- Advertisement -

యూట్యూబ్ ఏ కాదు సినిమాలలో కూడా..

ఒక యూట్యూబ్లోనే కాదు పలు చిత్రాలు లో కూడా నటించింది.. అలా లై, మెంటల్ మదిలో వంటి సినిమాలలో నటించింది. కొన్ని నెల క్రితం సుశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి వాహనం చేసుకున్న ఈమె అందరిలాగే సొంత ఇల్లు కొనాలని కలలు కంది.. తాజాగా ఆ కలను సహకారం చేసుకోవడంతో ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. మొత్తానికైతే తన సొంత ఇంటి కల నెరవేరడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jahnavi Dasetty (@mahathalli)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు