Movie Theatre Ads : PVR INOX లో ఇక నుంచి యాడ్ ఫ్రీ… కానీ, హైదరాబాదీలకు నిరాశే

PVR INOX Theatre Ads : కరోనా కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పటికీ థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరగకపోవడం గమనార్హం. ఇక సింగిల్ స్క్రీన్ల సంగతి పక్కన పెడితే పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్స్ లలో యాడ్స్ తో సహనాన్ని పరీక్షిస్తారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అందులో మూవీ స్టార్ట్ అవ్వడానికి అరగంట ముందు నుంచి ఈ యాడ్లతో మోత మోగిస్తుంటారు. అయితే తాజాగా ఈ విషయంలో పివిఆర్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

10 నిమిషాలే యాడ్స్..

సాధారణంగా సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్ లో దాదాపు 16 నిమిషాల వరకు యాడ్స్ వేస్తూ ఉంటారు. ప్రతి థియేటర్ లో ప్రతి షోకు ముందు దీన్నే ఫాలో అవుతారు. కానీ ఐనాక్స్ లో మాత్రం ఏకంగా ఇంటర్వెల్ తో కలిపి 35 నిమిషాల పాటు యాడ్స్ స్క్రీనింగ్ జరుగుతుంది. దీంతో ఐనాక్స్ లాంటిది థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులు యాడ్స్ ను తలనొప్పిగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పివిఆర్ ఐనాక్స్ తో పాటు మల్టీప్లెక్స్ లో ఫుట్ ఫాల్ భారీగా పడిపోవడంతో, దాన్ని పెంచుకోవడానికి తాజాగా నిర్వాహకులు 35 నుంచి 10 నిమిషాలకు యాడ్స్ స్క్రీనింగ్ టైం తగ్గించడం విశేషం.

హైదరాబాదీలకు నిరాశే..

మెట్రోపాలిటన్ సిటీస్ లో ముఖ్యంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ లో ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో హైదరాబాదీలకు నిరాశే. ఈ పది నిమిషాల్లోనే ట్రైలర్ తో పాటు అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన యాడ్స్ కూడా ఇవ్వబోతున్నారు. 3 నెలల తరువాత ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి మిగతా నగరాల్లో యాడ్స్ టైమింగ్ గురించి నిర్ణయం తీసుకుంటామని పివిఆర్ ఐనాక్స్ సీనియర్ పర్సన్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

యాడ్స్ ఫ్రీ స్ట్రాటజీ

ఇక ఇప్పటిదాకా ఓటిటిలు సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకు యాడ్స్ ఫ్రీ కంటెంట్ ఇస్తున్నట్టుగానే, ఐనాక్స్ కూడా యాడ్ ఫ్రీ మూవీ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంటే యాడ్స్ లేకుండా సినిమాను చూడాలంటే టికెట్ చార్జెస్ తో పాటు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఆడియన్స్ కు పనీ పాటా లేదా?

తాజాగా పివిఆర్ ఇనాక్స్ నిర్వాహకులు ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రీమియం స్క్రీనింగ్ చూసే జనాలు చాలా టైమ్ కాన్షియస్ అని కామెంట్ చేశారు. అలాగే థియేటర్లలో ప్లే చేసే చాలా యాడ్స్  ప్రీమియం స్క్రీనింగ్ కు హాజరయ్యే ప్రేక్షకులు టార్గెట్ ఆడియన్స్ కాదని చెప్పుకొచ్చారు.

దీంతో అంటే మీ రెగ్యులర్ స్క్రీనింగ్ టైం కాన్షియస్ కాదా? మీరు అరగంటసేపు యాడ్స్ తో బాదినప్పటికీ సైలెంట్ గా సినిమా చూస్తున్నాము కాబట్టి మమ్మల్ని పనీ పాటా లేని వాళ్ళు అనుకుంటున్నారా? అంటూ ఫైర్ అవుతున్నారు పివీఆర్ ఐనాక్స్ లో సినిమాలను చూసే జనాలు. మరి దీనికి పివిఆర్ ఐనాక్స్ యాజమాన్యం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు