Mari Selvaraj: దర్శన తో ధ్రువ్

ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం అనేది కామన్ థింగ్. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో ఎక్కువమంది బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే. అతి తక్కువ మంది మాత్రమే తమకు తాముగా ఎదిగి తమకంటూ ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసుకుని, హీరోగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. ఈ తరంలో అలా చూసుకుంటే నాని,నవీన్ పోలిశెట్టి, సుహాస్ వీళ్ళ పేర్లు వినిపిస్తాయి.

వీళ్లు కూడా అందరిలా కాకుండా సెలెక్టెడ్ మూవీస్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తే వాళ్లు మనల్ని ఆదరించరు అని ఒక ఖచ్చితమైన నమ్మకాన్ని వాళ్లు గుర్తుపెట్టుకుని ఎప్పుడూ ఆడియన్స్ కి నచ్చే సినిమాలను ఇవ్వడంలో ముందుంటారు. ఏది పడితే ఆ సినిమా చేయకుండా సెలెక్టెడ్ గా సినిమా చేయటానికి మెయిన్ రీజన్ ఇదే అని చెప్పొచ్చు.

ఇకపోతే మిగతా ఇండస్ట్రీలో కూడా స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు ఉంటారు. ఇక తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే చియాన్ విక్రమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం తమిళ ప్రేక్షకులుకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులుకు కూడా బాగా సుపరిచితుడు. చియాన్ విక్రమ్ చేసిన చాలా సినిమాలు తెలుగులో కూడా హిట్ అయి మంచి ఆదరణ పొందుకున్నాయి. రీసెంట్ టైమ్స్ లో విక్రమ్ నుంచి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకునే సినిమా అంటూ రాలేదు.

- Advertisement -

విక్రమ్ కి తెలుగులో మంచి పేరు తీసుకొచ్చిన సినిమా మాత్రం అపరిచితుడు అని చెప్పొచ్చు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి, విక్రమ్ కి ఇంకొంతమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇప్పుడు విక్రమ్ తమిళ్లో చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూ రిలీజ్ అవుతుంది.

విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో ఆదిత్య వర్మ పేరుతో తీశారు. ఆ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధ్రువ్ విక్రమ్. ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం చేసిన మహాన్ సినిమాలో నటించాడు. ఆ సినిమా కేవలం ఓటిటి కి మాత్రమే పరిమితమైంది. అందుకే ఇప్పటివరకు ధ్రువ్ కి సరైన హిట్ అంటూ లేదు.

ఇకపోతే ధ్రువ్ ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను లో నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. “పెరియారుమ్ పెరుమాల్” “కర్ణన్” వంటి సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు మారి సెల్వరాజ్. ఇప్పుడు మారి సెల్వరాజ్ విక్రమ్ తో చేస్తున్న సినిమాలో, హృదయం సినిమాతో మంచి గుర్తింపు సాధించిన దర్శన రాజేంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దర్శన రాజేంద్రన్ ఇదివరకే తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు