Yuvaraj Singh: ఒక్క క్రికెటర్ మోజులో ఇంతమంది హీరోయిన్సా..?

Yuvaraj Singh.. సినిమా రంగానికి..రాజకీయ రంగానికి ఎంత అవినాభావ సంబంధం ఉందో.. అలాగే సినీ రంగానికి – క్రీడారంగానికి కూడా అంతే అవినాభావ సంబంధం ఉంది అనడంలో సందేహం లేదు.. అంతేకాదు చాలామంది క్రికెట్ రంగానికి చెందిన గొప్ప వారి జీవిత కథలను కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. మరోవైపు చాలామంది క్రికెటర్లు సినీ రంగానికి చెందిన హీరోయిన్స్ తో ప్రేమలో పడగా.. మరి కొంతమంది పెళ్లి చేసుకుంటే ఇంకొంతమంది ప్రేమ వరకే ఆ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే ఒక క్రికెటర్ చాలామంది హీరోయిన్స్ తో ప్రేమాయణం కొనసాగించి.. చివరికి ఏ ఒక్కరిని కూడా ఆయన సినీ రంగానికి చెందిన వారిని వివాహం చేసుకోలేదు.. మరి ఆయన ఎవరు? ఆయనతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్ ఎవరు ?అనే లిస్టు ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో హీరోయిన్స్ ప్రేమాయణం..

కిమ్ శర్మ:

- Advertisement -

మొహబ్బతే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కిమ్ శర్మ తో యువరాజ్ మొదట ప్రేమాయణాన్ని నడిపించారు.. కొద్ది రోజుల వరకు వీళ్ళ బంధం మొదట సాఫీగా సాగినప్పటికీ.. ఆ తర్వాత యువరాజ్ తల్లి కారణంగా వీరి బంధం మధ్యలోనే ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

దీపికా పదుకొనే..


షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ఓం శాంతి ఓం అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన దీపికా పదుకొనే.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఇక 2007 T20 వరల్డ్ కప్ జరిగిన సమయంలో యువరాజ్ కి చాలా దగ్గరైందనే వార్తలు వచ్చాయి. గ్రౌండ్లో యువరాజ్ సిక్స్ కొట్టిన ప్రతిసారీ.. స్టేడియంలో అతడిని ఎంకరేజ్ చేస్తూ హల్చల్ చేసింది.. అంతేకాదు యువరాజ్ సక్సెస్ ను దీపికా సెలెబ్రేట్ చేసుకోవడం చూసిన ప్రతి ఒక్కరు.. వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉందని అనుకున్నారు.. అందుకు తగ్గట్టుగానే యువరాజ్ సింగ్ బర్తడేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసినట్టు వార్తలు కూడా వినిపించాయి. ఇక వీరిద్దరి మధ్య మంచి ప్రేమ బంధం ఉందని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో ధోని రావడంతో యువరాజ్ కు దీపిక గుడ్ బై చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రీతి జింగానియా:


షారుక్ ఖాన్ హీరోగా నటించిన మొహబ్బతేన్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న ప్రీతి తో కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన యువరాజ్.. ఆమెను వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు.. కానీ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.

రియాసేన్:
రియాసేన్ తో కూడా ఈయన చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. వీళ్లిద్దరూ చాలా రోజుల పాటు డేటింగ్ కూడా చేసుకున్నారు.. అంతేకాదు ఎక్కడ చూసినా ఈ జంటే .. పార్టీలు, పబ్బులు అంటూ చట్టపట్టలేసుకొని తిరగడం చూసి రిలేషన్షిప్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ విడిపోయారు.

మినిషా లాంబా:
యువరాజ్ సింగ్ మినిషా లాంబా ఇద్దరు కలిసి ఒక పార్టీలో ముద్దులు పెట్టుకుంటూ దిగిన ఫోటోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే దీనిపై మినిషా లాంభా స్పందిస్తూ.. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని ఎవరో కావాలని అలా చేశారంటూ కామెంట్లు చేసింది..

వీరితోపాటు తన చిన్ననాటి స్నేహితురాలైన అంచల్ కుమార్ తో కూడా డేటింగ్ చేశారు.. ఆ తర్వాత వీరిద్దరూ కూడా విడిపోయారు..

ఇక చివరికి హాజెల్ కీచ్ అనే అమ్మాయిని వివాహం చేసుకొని ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు