Ram Gopal Varma: వ్యూహానికి విముక్తి

రామ్ గోపాల్ వర్మ, ఇది కేవలం పేరు కాదు వివాదాలకు మారుపేరు. శివ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అప్పట్లో శివ సినిమా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేనిది. ఒక సినిమా ఇంపాక్ట్ పరిశ్రమ మీద ఎలా ఉంటుందో అని ప్రూవ్ చేసిన సినిమా. శివ లో ఉండే ప్రతి షాటు, ప్రతి ఫ్రేమ్, ప్రతి ఎలిమెంట్ కూడా అప్పటి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అప్పటినుండి రాంగోపాల్ వర్మ కి మంచి రెస్పెక్ట్ దక్కింది.

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా అంటే చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే అటువంటి బ్లాక్ బస్టర్ కాన్సెప్ట్ లను రాంగోపాల్ వర్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు. అంతేకాకుండా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. ఒక సినిమాను త్వరగా తెరకెక్కించడంలో ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలోనూ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు అని చెప్పొచ్చు.

కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా అంటే అంతగా ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే రాము ఎప్పుడూ ఒకే తీరుతో ఉంటాడు. సినిమాలు నా ఇష్టంతో తీస్తున్నాను. జనాలు ఇష్టపడాలని కాదు అంటూ చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఒకప్పుడు రాము తీసిన సినిమాలు, తను ఇష్టపడుతూ తీసిన కూడా జనాలు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు రాము ఇష్టపడే సినిమాలను రాము తప్ప ఎవరూ ఇష్టపడట్లేదు అనే స్థాయికి దిగిపోయాయి రాము సినిమాలు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రాంగోపాల్ వర్మ బెస్ట్ వర్క్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. రక్త చరిత్ర సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన బెస్ట్ ఫిలిం అంటే చెప్పలేము. అయితే రామ్ గోపాల్ వర్మ సినిమా తీయటం మాత్రం ఆపలేదు. ఒకదాని తర్వాత ఒక సినిమా తీస్తూనే ఉన్నాడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరికాస్త వివాదాస్పద సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.

లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఒక సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఆ సినిమాను ఆంధ్రాలో రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా వ్యూహం అనే మరో సినిమాను సిద్ధం చేశాడు రాంగోపాల్ వర్మ. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కావాలి. కానీ అప్పటినుండి ఏవేవో అడ్డంకులు వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

ఈ సినిమాకి ఇదివరకే ఇప్పటికీ మూడు రిలీజ్ డేట్లను అనౌన్స్ చేశారు. అవన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. మొత్తానికి మార్చి రెండో తారీఖున వ్యూహం సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఎన్నో అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకి విముక్తి దొరికిందని చెప్పవచ్చు. ఈ సినిమా 2009 నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్ పరిణామాల మధ్య తెరకెక్కించబడినట్టు రాంగోపాల్ వర్మ ఇదివరకే ప్రకటించారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు