Kalki: కల్కి మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో.. ఎవరంటే..?

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి భారీ హైప్స్ ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభాస్ ని ఈ సినిమాలో చూడబోతున్నారు అభిమానులు .. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ,దిశాపటాని వంటి వారు నటిస్తూ ఉన్నారు.. విలన్ గా కమలహాసన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు

కల్కి మూవీ లో రాజేంద్రప్రసాద్:
అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో మాత్రం బాగా వినిపిస్తూ ఉంటుంది.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ ఫిలింనగర్ లో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఇందులో తెలుగులో సీనియర్ నటుడైన రాజేంద్రప్రసాద్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్.. ఇలా మాట్లాడుతూ వందల కోట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. నేను ప్రాజెక్ట్-K చిత్రంలో కూడా నటిస్తున్నానంటూ వెల్లడించారు.

క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్:
అలాగే మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేస్తున్నానంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అయితే ఈ వీడియో మాత్రం ఎప్పటిది అనే విషయం పైన క్లారిటీ రాలేదు.. కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే మొదటిసారి ప్రభాస్ ,రాజేంద్రప్రసాద్ కలయికలో సినిమాని చూడబోతున్నామని చెప్పవచ్చు.

- Advertisement -

కల్కి పై నాగ్ అశ్విన్ కామెంట్స్..
ఈ ఏడాది గుర్గావ్ లో జరిగిన సినాప్స్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాల్గుంటు కల్కి చిత్రం పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ చిత్రం 6000 ఏళ్ల మధ్య జరిగే కథాంశమని.. ఇందుకు సరికొత్త ప్రపంచాన్నే సృష్టించామని వెల్లడించారు. ఈ చిత్రంలోని పాత్రలన్నీ కూడా ఇండియన్ మైథాలజీ చుట్టూ తిరుగుతాయని భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నామని వెల్లడించారు.. ఒక ఊహ ప్రపంచాన్ని కూడా రూపొందించామంటూ తెలిపారు.. క్రీ. శ.3102 నుంచి.. క్రి. శ.2898 వరకు మొత్తం 6,000 సంవత్సరాల వెనుక కథ అన్నట్టుగా వెల్లడించారు.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే9 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే సినిమాని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.. మరీ ప్రభాస్ నమ్మకాన్ని నాగ్ అశ్విన్ నిలబెడతారో లేదో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు