Rana Daggubati : బాక్సింగ్ కింగ్ బయోపిక్ లో రానా?

రానా దగ్గుబాటి హిట్ ట్రాక్ తప్పి చాలా ఏళ్ళే గడుస్తోంది. బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఈ హీరో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినప్పటికీ అన్నీ డిజాస్టర్లు గానే నిలిచాయి. “బాహుబలి” ఇచ్చిన పాపులారిటీతో రానా ఇమేజ్ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. దీంతో వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది రానాకు. కానీ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా పడలేదు. చివరగా భీమ్లా నాయక్, విరాటపర్వం సినిమాల్లో హీరోగా కనిపించిన రానా కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ “రాక్షస రాజా” అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. నెక్స్ట్ రానా చేయబోయే మూవీ బయోపిక్ అని సమాచారం. మరి రానా ఎవరి బయోపిక్ లో నటించబోతున్నాడు? “రాక్షస రాజా” మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

“రాక్షస రాజా” ఇంకా స్టార్ట్ కానే లేదు
“నేనే రాజు నేనే మంత్రి” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ తేజ. ఈ సూపర్ హిట్ కాంబో తాజాగా మరోసారి రిపీట్ కాబోతోంది. ఆ మూవీకి “రాక్షస రాజా” అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టిన మేకర్స్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. రానా పుట్టినరోజు సందర్భంగా “రాక్షస రాజా” టైటిల్ తో పాటు రానా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లో గడ్డంతో సిగార్ తాగుతూ చాలా బీభత్సమైన అవతారంలో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు రానా. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను పోషించబోతున్నాడని తెలుస్తోంది. కాగా టాలెంటెడ్ బ్యూటీ రుహాని శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. 2023 డిసెంబర్లోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఇంకా షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఇప్పుడు రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు సీజన్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే “రాక్షస రాజా” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత రానా చేయనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ బయోపిక్ అనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

నెక్స్ట్ బయోపిక్ లో…
ప్రస్తుతం రానా వరుసగా సినిమాలను లైన్లో పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగానే పలువురు దర్శకులతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కిషోర్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయడానికి రానా రెడీ అవుతున్నాడని సమాచారం. ఈ మూవీని బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్ వారు నిర్మించబోతున్నారు. దీంతోపాటు రానా బాక్సింగ్ కింగ్ మహమ్మద్ అలీ బయోపిక్ లో నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నాడని తెలుస్తోంది. హెవీ వెయిట్ ఇండియన్ బాక్సర్ గా ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసిన మహమ్మద్ అలీ ఎన్నో ప్రతిష్టాత్మక పతకాలను అందుకున్నాడు. ఆయన జీవిత కథ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అనే ఉద్దేశంతో మహమ్మద్ అలీ బయోపిక్ లో నటించడానికి రానా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరు దర్శకులతో చర్చలు నడుస్తున్నాయి. దీన్ని సినిమాగా తియ్యాలా? లేదంటే వెబ్ సిరీస్ గా తీయవచ్చా ? అని ఆలోచిస్తున్నారట మేకర్స్. ఒకవేళ సినిమా అయితే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుంది. కాగా మహమ్మద్ అలీ జీవిత కథపై ఇప్పటికే అనేక హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. కానీ ఇండియాలో మాత్రం ఆయన బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి ఒక్కరు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. ఏదైతేనేం రానా బాక్సర్ పాత్రకు సరిగ్గా సెట్ అవుతాడు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు