Vishwak Sen: ఆయన తలెత్తుకునేలా చేశాడు, ఈయన కాలర్ ఎత్తుకునేలా చేసాడు

వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్సేన్. అయితే వెళ్ళిపోమాకే సినిమా వచ్చినప్పుడు విశ్వక్సేన్ దినేష్ నాయుడుగా తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆ పేరును విశ్వక్సేన్ గా మార్చుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో విశ్వక్సేన్ కి మంచి గుర్తింపు లభించింది.

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడుగా అప్పటికే మంచి గుర్తింపును సాధించుకున్న తరుణ్ భాస్కర్ రెండవ చిత్రం “ఈ నగరానికి ఏమైంది” ఆ సినిమాలో వివేక్ పాత్రలో కనిపించి అందరినీ బాగా ఆకట్టుకున్నాడు విశ్వక్సేన్. ఆ సినిమా తర్వాత విశ్వక్సేన్ దర్శకుడుగా కూడా తన ప్రతిభను చూపించాడు. మలయాళం సూపర్ హిట్ సినిమా “అంగమల్ డైరీస్” కి రీమేక్ గా ఫలక్నామా దాస్ సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా కూడా మంచి పేరును సాధించుకున్నాడు విశ్వక్సేన్. ఈ సినిమాకి వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ మంచి ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు.

ఆ తర్వాత పలు విభిన్నమైన చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక వైవిధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. విశ్వక్సేన్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అని ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేసుకోగలిగాడు. విశ్వక్సేన్ లో కేవలం నటుడు మాత్రమే కాకుండా దర్శకుడు కూడా ఉన్నాడని ఇదివరకే ప్రూవ్ అయింది. విశ్వక్సేన్ ఫలక్నామా దాస్ సినిమా తర్వాత దమ్కీ అనే ఒక సినిమాను కూడా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.

- Advertisement -

అయితే విశ్వక్సేన్ “గామి” అనే సినిమా కోసం గత నాలుగేళ్లుగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా గత ఆరేళ్లుగా తెరకెక్కుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెక్స్ట్ జరగబోయే బిగ్గెస్ట్ థింగ్ లో “గామి” ప్రాజెక్ట్ ఒకటి అని చెప్పొచ్చు. ఈ టీజర్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది.రీసెంట్ గా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జరిపారు. ఈ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు.

ఈ ఫంక్షన్ లో విశ్వక్సేన్ సందీప్ రెడ్డి వంగాని గురించి మాట్లాడుతూ.. సినిమాలు చేయకుండా హీరో స్టేటస్ పొందిన ఏకైక వ్యక్తి మీరే అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు తెలుగు ప్రేక్షకులను తలెత్తుకునేలా చేశారు. ఆ తర్వాత మీరు తెలుగు ప్రేక్షకులను కాలరెత్తుకునేలా చేశారంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మనకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత ఎస్.ఎస్.రాజమౌళిది. అలానే చాలా తక్కువగా చూసే బాలీవుడ్ కి టాలీవుడ్ స్థాయి ఏంటి అని బాలీవుడ్ కెళ్ళి సినిమా తీసి అద్భుతమైన హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ. దీనిబట్టి విశ్వక్సేన్ చెప్పిన మాటల్ని అందరూ అంగీకరిస్తున్నారని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు