Premalu : “భీమా”, “గామి”కి “ప్రేమలు” ఎఫెక్ట్… ఈ డబ్బింగ్ సినిమాకు భయపెట్టేంత సీన్ ఉందా?

మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం అందుకున్న తాజా మూవీ “ప్రేమలు”. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం 15 రోజుల్లోనే 67 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లవ్ అండ్ కామెడీ డ్రామా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నిర్మించిన ఈ సినిమాకు గిరీష్ ఏడి దర్శకత్వం వహించారు. మమితా, నస్లేన్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్, అల్తాఫ్ సలీం ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ ను మార్చ్ 8న వెండితెర పైకి తీసుకురాబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే మహాశివరాత్రి కానుకగా మార్చి 8న విశ్వక్సేన్ “గామి”తో, “భీమా”తో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మరి ఈ ఇద్దరు హీరోలను భయపెట్టేంత సీన్ డబ్బింగ్ మూవీ “ప్రేమలు”కు ఉందా? అంటే…

“గామి” వర్సెస్ “భీమా”

విశ్వక్ సేన్ అఘోరాగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గామి”. విద్యాధర దర్శకత్వం అందిస్తున్న “గామి” మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా, అభినయ, హారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న “గామి”కి ఎట్టకేలకు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” వాయిదా వల్ల విడుదల లభించింది. గత ఎనిమిదేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చ్ 8న థియేటర్లలోకి రావడానికి రెడీ అయింది. 2017లో “గామి” మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయగా, 2018లో షూటింగ్ మొదలైంది. దాదాపు 5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న “గామి” ఇప్పుడు విశ్వక్ సేన్ కెరీర్ కు గేమ్ చేంజర్ అయ్యేలా కనిపిస్తోంది.

- Advertisement -

మ్యాచో హీరో గోపీచంద్ “భీమా”తో మార్చ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. కన్నడ డైరెక్టర్ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే ఆయనకు టాలీవుడ్ లో మొదటి సినిమా కాగా, శాండల్ వుడ్ లో మాత్రం శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో వేద, వజ్రకాయ, భజరంగీ వంటి పలు సినిమాలను రూపొందించాడు. “భీమా” సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మార్చ్ 8న ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతుండగా, డబ్బింగ్ మూవీ “ప్రేమలు” కూడా అదే రోజున క్లాష్ కు రెడీ అవుతోంది.

ఈ డబ్బింగ్ సినిమాకు భయపెట్టేంత సీన్ ఉందా?

“ప్రేమలు” మూవీ కూడా మార్చి 8న రిలీజ్ కు రెడీ అవుతోంది అని వార్తలు రాగానే, “భీమా”, “గామి”కి గట్టి పోటీ తప్పదని అందరూ భావించారు. కానీ తాజాగా రిలీజ్ అయిన “గామి” ట్రైలర్, “భీమా” టీజర్ రెండూ అందరి అంచనాలను తలకిందులు చేశాయి. ముఖ్యంగా “గామి” మూవీతో విశ్వక్ సేన్ జాతీయస్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంటాడు అనే కామెంట్స్ వినిపిస్తుండగా, “భీమా”కు యాక్షన్ తో పాటు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డివోషనల్ టచ్ ఇచ్చిన గోపీచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని అన్పిస్తోంది. స్ట్రాంగ్ బజ్ ఉన్న ఈ రెండు సినిమాలకు పోటీగా అదే రోజు థియేటర్లలోకి రాబోతున్న డబ్బింగ్ మూవీ “ప్రేమలు”కు గోపీచంద్, విశ్వక్ ను భయపెట్టే అంత సీన్ ఉందా అంటే లేదు అనే సమాధానమే విన్పిస్తోంది. మరి తెలుగు సినిమాలకు ఈ బ్లాక్ బస్టర్ డబ్బింగ్ మూవీ ఎంతవరకు పోటీని ఇవ్వగలుగుతుందో చూడాలంటే మార్చ్ 8 వరకు వెయిట్ చేయక తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు