Sneha Reddy: ఆ విషయంలో హీరోయిన్స్ తో పోటీపడుతున్న అల్లు స్నేహారెడ్డి..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ హీరోల భార్యలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మరింతగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ ను మించిపోయి మరీ రెడీ అవుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఫాలోవర్స్ ను బాగానే సంపాదించుకుంది.. ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా సోషల్ మీడియాలో ఈ అమ్మడు గురించి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

సోషల్ మీడియాలో పాపులారిటీ:
గతంలో స్నేహ రెడ్డి తమ కుటుంబానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూ ఉండేది.ముఖ్యంగా తమ పిల్లలు, అల్లు అర్జున్ కి సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది.. అయితే ఆ తర్వాత నెమ్మదిగా తన అందమైన ఫోటోలతో కూడా మరింత ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా తన ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది స్నేహ రెడ్డి.. ఎక్కువగా యోగ, జిమ్ వర్కౌట్ పై ఆసక్తి ఉందంటూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా చెప్పకనే తెలియజేసింది..

ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి:
ఇకపోతే అల్లు స్నేహ రెడ్డి ఇంత ఫిట్ గా ఉండడానికి గల కారణాన్ని వెల్లడించింది. రీసెంట్గా గార్డెన్ ఏరియాలో జిమ్ చేస్తున్న ఒక వీడియోను షేర్ చేసింది. అలాగే యోగా చేస్తున్నట్లుగా కూడా తెలియజేసింది స్నేహారెడ్డి.. దీన్ని బట్టి చూస్తే స్నేహారెడ్డి ఫిట్నెస్ రహస్యం ఇదే అంటూ చెప్పకనే చెప్పేసిందని అల్లు అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఫిట్నెస్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు.

- Advertisement -

స్నేహారెడ్డి కెరియర్ విషయానికి వస్తే..
అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం అల్లు స్నేహారెడ్డి సినిమాలలోకి రాబోతోందని పలు రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి.. అయితే ఈ విషయం పైన ఎక్కడా కూడా ఏమి పెద్దగా స్పందించలేదు..అయితే మోడల్ గా కూడా ఈమె అడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి స్నేహారెడ్డి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుందో చూడాలి..

తల్లి బాటలో కూతురు కూడా..
అల్లు స్నేహారెడ్డి కూతురు అల్లు అర్హ కూడా తల్లి లాగే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. అల్లు అర్హ కూడా అప్పుడప్పుడు పలు రకాల వీడియోలను చేయగా.. వాటిని స్నేహా రెడ్డి షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ కృషి చేస్తూ ఉంటుంది.. అల్లు అయాన్ కూడా అల్లు అర్జున్ తరహాలోనే చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటించింది.. అల్లు అయాన్ కూడా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అయాన్ మాత్రం ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు