Venkatesh Movie: మళ్లీ మహేష్‌ బాబుతో పోటీ… ఈ సారి వెంకీ మామ నెగ్గుతుడా ?

Venkatesh Movie:  ఫ్యామిలీ హీరో వెంకటేష్ దగ్గుబాటి ఈ మధ్య కాలంలో తన జానర్‌ను పక్కన పెట్టి, కొత్తగా ట్రై చేస్తున్నాడు. అలా వచ్చిన రానా నాయుడు హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, వెంకీ మామ అలా కనిపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో రానా నాయుడు తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జానర్ ను ఎంచుకుని హిట్ ఫ్రాంచైజీతో హిట్స్ అందుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ చేశాడు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన సైంధవ్ మూవీ ఆడియన్స్ నుంచి మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.

స్టోరీ, శైలేష్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు, స్క్రిన్ ప్లే బాగానే ఉన్నాయని, కానీ, సైంధవ్ గురించి చెప్పాల్సిన మైనస్… రిలీజ్ డేట్ అని క్రిటిక్స్ నుంచి రివ్యూలు వచ్చాయి. సైంధవ్ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ వచ్చే సంక్రాంతి టైంలో కాకుండా, నార్మల్ రోజుల్లో రిలీజ్ చేస్తే సైంధవ్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చేదని అంటున్నారు.

అయితే ఈ సైంధవ్ మూవీ ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతుంది. 15 కోట్లకు ఓటీటీ రైట్స్ అందుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో… సైంధవ్ మూవీని ఫిబ్రవరి 09 నుంచి స్ట్రిమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఓటీటీలో కూడా వెంకీ మామకు పోటీ తప్పడం లేదు. అదే రోజు ఇదే సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం కూడా ఓటీటీలోకి రాబోతుందని టాక్ ఉంది.

- Advertisement -

గుంటూరు కారం సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కూడా నెల రోజుల కంటే ముందుగానే ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అలా ఫిబ్రవరి 09న ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే థియేటర్స్ లో వెంకీ మామపై మహేష్ బాబు కంప్లీట్ డామినేషన్ చూపించాడు. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది చూడాలి.

అయితే సైంధవ్ ఓటీటీ వర్షెన్‌లో కొన్ని మార్పులు ఉంటాయని సమాచారం. సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు ఓ సాంగ్ ను కూడా యాడ్ చేస్తున్నారట. ఇది సినిమాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట. మరి ఈ మార్పుల తర్వాత ఓటీటీలో మహేష్ బాబుపై వెంకీ మామ గెలుస్తాడేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు