Hbd Namratha: మహేష్, నమ్రత ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ… ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?

Hbd Namratha: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి హీరోయిన్ నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు తన భర్త మహేష్ స్పెషల్ గా విష్ చేశారు. మరోవైపు సూపర్ స్టార్ అభిమానుల నుంచి నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంటలలో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట కూడా ఒకటి. అయితే వీళ్ళ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మరి మహేష్, నమ్రతలలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? మహేష్, నమ్రత లవ్ స్టోరీని పెళ్లి వరకు తీసుకెళ్లింది ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు నమ్రత పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం.

ముందుగా మహేష్ నమ్రతల మధ్య ప్రేమ ఎక్కడ చిగురించింది అనే విషయంలోకి వెళ్తే… నమ్రత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ బ్యూటీ టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది. అందులో భాగంగానే మహేష్ బాబుతో కూడా కలిసి నటించింది నమ్రత. అలా వీళ్ళిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా వంశీ. అప్పుడే కెరీర్ ను ప్రారంభించిన మహేష్ ఈ సినిమా చేస్తున్న టైంలోనే నమ్రత ప్రేమలో పడిపోయారు.

2000 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మహేష్, నమ్రత మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అంతా కలిసి న్యూజిలాండ్ వెళ్లారట. అప్పట్లో దాదాపు నెల రోజులు అక్కడే షూటింగ్ జరగగా, సినిమా సెట్ లో ముందుగా స్నేహితులైన ఈ జంట మధ్య బంధం ఆ తర్వాత సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. అలా ఐదేళ్లపాటు ఈ జంట ప్రేమాయణం సాగించారు. ఈ ఐదేళ్లలోనూ తమ ప్రేమ జీవితంలో పలు అడ్డంకులను ఎదుర్కొని ఆ తర్వాత పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఈ లవ్లీ కపుల్.

- Advertisement -

ఇక ఆ సినిమా షూటింగ్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత నమ్రత ముందుగా తన ప్రేమను బయట పెట్టేసిందట. స్వయంగా నమ్రత మహేష్ బాబుకు ప్రపోజ్ చేసి, ఆయనతో జీవితాంతం నడవాలని డిసైడ్ అయినట్టు తన అభిప్రాయాన్ని మహేష్ ముందు పెట్టేసిందట. అప్పటికే నమ్రత అంటే ఇష్టం ఉన్న మహేష్ ఆమె స్వయంగా వచ్చి ఐ లవ్ యు అని చెప్పడంతో వెంటనే యాక్సెప్ట్ చేశారట. ఇక ఆ తర్వాత సమయం చూసుకొని ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా, ముందుగా వీరి ప్రేమకు మహేష్ బాబు కుటుంబం అంగీకరించలేదట.

కానీ ఆ సమయంలో మహేష్ సోదరి మంజుల కలగజేసుకొని వీళ్ళ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు నడిపించిందట. అలా మంజుల చొరవతో 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య మహేష్, నమ్రత పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. కానీ అప్పట్లో ఇప్పుడున్నట్టు సోషల్ మీడియా లేదా మీడియా ఎఫెక్ట్ ఈ రేంజ్ లో లేకపోవడంతో వీరి పెళ్లికి సంబంధించిన వివరాలు బయటకు అంత త్వరగా రాలేదు. దీంతో వీళ్ళ పెళ్లి గురించి చాలా రూమర్స్ వైరల్ అయ్యాయి. కాగా పెళ్లి తర్వాత సినిమాలను వదిలేయాలని ముందే డిసైడ్ అయిన నమ్రత దాన్నే ఫాలో అయ్యి ఇప్పటివరకు అదే కంటిన్యూ చేస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు