Saindhav : “సైంధవ్” ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Saindhav :  విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సైంధవ్” భారీ అంచనాల నడుమ జనవరి 13న థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే “సైంధవ్” మూవీ ఓటిటి పార్టనర్ ఎవరు? ఈ రివేంజ్ డ్రామా ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. మరి ఇంతకీ “సైంధవ్” మూవీ ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

విక్టరీ వెంకటేష్ 75వ మూవీ “సైంధవ్”. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. ఇంతకాలం ఫ్యామిలీ హీరోగా ఉంటూ వచ్చిన వెంకటేష్ ను డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీతో సైకోగా మార్చేశాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన.

ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. కానీ స్లో నేరేషన్ ఉండడమే ఇబ్బంది పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇలా మిక్స్డ్ టాక్ తో నడుస్తున్న “సైంధవ్” మూవీ ఓటిటి డీల్ గురించి ఆసక్తి మొదలైపోయింది.

- Advertisement -

వెంకటేష్ “సైంధవ్” డిజిటల్ రైట్స్ ని పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం. ఈ మూవీ ఓటిటి రైట్స్ కోసం భారీ పోటీ ఎదురైనప్పటికీ అన్ని ఓటీటి సంస్థలతో పోటీపడి మరీ భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ చేజెక్కించుకుందని సమాచారం. అయితే “సైంధవ్” మూవీ ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ అంచనా ప్రకారం రెండు తేదీలు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి.

అయితే ఆ సినిమా హిట్టా ఫ్లాఫా, కలెక్షన్స్ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తారు. ఇక “సైంధవ్” విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీని ఫిబ్రవరి రెండో వారంలో మహాశివరాత్రి సందర్భంగా లేదంటే మార్చిలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ తో పాటు ఈటీవీ విన్ కూడా “సైంధవ్” ఓటిటి రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో థియేటర్లలో రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ “సైంధవ్” మూవీ ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు