mythri movie makers : “హనుమాన్” కోసం మైత్రి నిర్మాతల పిర్యాదు..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా, అందులో గుంటూరు కారం, హనుమాన్ జనవరి 12న రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ రిలీజ్ అయిన సినిమాల్లో “గుంటూరు కారం” ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, హనుమాన్ మాత్రం మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే గుంటూరు కారం పెద్ద సినిమా కావడం వల్ల హనుమాన్ ప్రదర్శించే థియేటర్లలో కూడా గుంటూరు కారం ఫస్ట్ డే అత్యధిక థియేటర్లలో ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా నైజాం లో చాలా థియేటర్లు హనుమాన్ ని బయ్యర్లు ప్రదర్శించలేదు.

అయితే ఈ విషయంపై హనుమన్ నైజాం డిస్ట్రిబ్యూటర్లు అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాతల మండలి లో కేసు వేశారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లో ఏముందంటే..

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP వారు “హనుమాన్” సినిమా 12-01-2024 నుండి ప్రదర్శన కొరకు తెలంగాణాలో కొన్ని థియేటర్లు వారితో అగ్రీమెంటు చేయడం జరిగింది. కానీ ఆ థియేటర్ల వారు ఈ అగ్రీమెంటు ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్ల లో ఈ సినిమా ప్రదర్శన చేయ లేదని దీని విషయమై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు నిర్మాత నిరంజన్ రెడ్డి గార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే థియేటర్ల అగ్రీమెంటు ప్రకారం “హనుమాన్” సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఆపార నష్టం జరిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే “హనుమాన్” సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలి అని చెప్పడం జరిగింది.

- Advertisement -

ఇక హనుమాన్ ప్రీమియర్ల నుండే మంచి కలెక్షన్లతో రచ్చ చేస్తుండగా, గుంటూరు కారం మిక్సడ్ రెస్పాన్స్ తో పలు థియేటర్ల వద్ద సగం మాత్రమే ఫుల్ అయింది. ఓవరాల్ గా కనీసం అగ్రిమెంట్ల ప్రకారం హనుమాన్ కి ఇవ్వాల్సిన థియేటర్లను అయినా ఇవ్వమని నిర్మాతల మండలి వారు చెప్పడం జరిగింది. మరి బయ్యర్లు హనుమన్ ని ఎన్ని థియేటర్లలో భర్తీ చేస్తారో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు