The Gray Man : ధనుష్ ది గ్రే మ్యాన్ కు సీక్వెల్

రుసో బ్రదర్స్, మార్వెల్ లవర్స్ కు ఎక్కువగా పరిచయం ఉన్న పేరు. హాలీవుడ్ లో కెప్టెన్ అమెరికా, ఎవెంజర్స్ వంటి పెద్ద సినిమాలకు ఈ రుసో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. రుసో బ్రదర్స్ నుంచి వచ్చిన తాజా సినిమా ది గ్రే మ్యాన్. హాలీవుడ్ హీరోలతో పాటు కోలీవుడ్ హీరో ధనుష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. ది గ్రే మ్యాన్ ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ది గ్రేమ మ్యాన్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడంతో రుసో బ్రదర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ది గ్రే మ్యాన్ కు సీక్వెల్ తీసుకువస్తున్నట్టు రుసో బ్రదర్స్ ప్రకటించారు. ఆసక్తికరమైన పాత్రలు, స్టోరీ ఉండటంతో ఈ సినిమాను ఒక ప్రాంఛైజ్ లా కొనసాగించాలని ఆలోచన ఉందని వెల్లడించారు.

త్వరలోనే ది గ్రేమ మ్యాన్ కు సీక్వెల్ ను తెరకెక్కిస్తామని చెప్పారు. ది గ్రే మ్యాన్ జర్నీ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రుసో బ్రదర్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో అనేక పార్ట్ లు ఉన్నట్టు తెలుస్తుంది. దాన్నే ప్రాంఛైజ్ లా తెరకెక్కించాలని రుసో బ్రదర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగ ది గ్రే మ్యాన్ ప్రాంఛైజ్ ఉండటం వల్ల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు హాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయడానికి ఉపయోగపడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు