NBK107 : షూటింగ్స్ బంద్ లాభమే?

టాలీవుడ్ నిర్మాతల మండలి వచ్చే నెల 1 నుండి షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత సినిమా ఇండస్ట్రీలో నష్టాలు, అధిక పారితోషికాలు, నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటంతో నిర్మాతలు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత షూటింగ్స్ మళ్లీ ప్రారంభించనున్నారు. అయితే షూటింగ్స్ బంద్ చేయడం వల్ల చాలా మంది హీరోలకు నష్టం జరుగుతుంది. కానీ నందమూరి అభిమానులు మాత్రం తమకు లాభం జరుగుతుందని అంటున్నారు.

అది ఎలా అంటే బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 107 అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు సగం వరకు పూర్తి అయింది. ఎన్బీకే 107 ను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ యూనిట్ అనుకుంది. కానీ సంక్రాంతి వరకు కాకుండా డిసెంబర్ లోనే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు షూటింగ్స్ బంద్ కావడంతో ఎన్బీకే 107 ను డిసెంబర్ లో విడుదల చేయడానికి వీలు కాదు. దీంతో సంక్రాంతికే విడుదల చేయాల్సి వస్తుంది. అప్పుడు సంక్రాంతి బరిలో తమ అభిమాన హీరో సినిమా ఉంటుందని, సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమాను చూడచ్చని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. ఇలా షూటింగ్ బంద్ ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు