Liger : అమ్మాయిలతో రౌడీ హీరో ఫైట్ ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా చిత్రం “లైగర్”. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అలాగే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, ప్రముఖ నటి రమ్యకృష్ణ, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ,సాంగ్స్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ఈ సినిమాలో మరో హైలెట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ 14 మంది లేడీ ఫైటర్స్ తో ఫైట్ సీన్ చేయనున్నట్లు సమాచారం. ఈ భారీ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని చిత్ర పరిశ్రమలో టాక్. ఇప్పటివరకు అమ్మాయిలతో రొమాన్స్ చేసిన విజయ్ దేవరకొండనే చూసాము కానీ.. ఇప్పుడు అమ్మాయిలతో బాక్సింగ్ చేయబోయే సీన్ చూడబోతున్నామని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫైట్ సీన్ పూరి జగన్నాథ్ ఏ విధంగా తెరకెక్కించాడో చూడాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు