RRR : తగ్గని హవా

మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 24న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండటంతో మొదటి నుంచే కలెక్షన్లు విపరీతంగా వచ్చాయి. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి 1200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ట్రిపుల్ ఆర్ సినిమాకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రేక్షకులు మద్దతు తెలిపారు. ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

ట్రిపుల్ ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్ అనే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా హవా ఇంకా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు సినిమాను చూసి, ట్విట్టర్ లో షేర్ చేస్తూ వచ్చారు. దీంతో ఇప్పటి వరకు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ట్విట్టర్ లో ట్రెండింగ్ గా ఉంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే, దానికి 1 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.

తాజాగా ట్రిపుల్ ఆర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో వరుసగా పది వారాల పాటు ట్రెండ్ అయిన నాన్ ఇంగ్లిష్ చిత్రం గా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. దీంతో సినిమా విడుదలై నాలుగు నెలలు దాటుతున్న హవా తగ్గలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు